CSK vs PBKS MS Dhoni : ఐపీఎల్ 2024లో చెన్నై జట్టు తన 10వ మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో అభిమానులు మరోసారి ధోని బ్యాటింగ్‌ను ఆస్వాదించారు. కానీ, ధోని చేసిన ఆ ఒక్కపని అభిమానులకు నచ్చకపోవడంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.
CSK vs PBKS - MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ 49వ మ్యాచ్ చెపాక్‌లో జరగ్గా, ఇందులో చెన్నై సూపర్ కింగ్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై టీమ్ టాస్ ఓడింది. మొత్తంగా మ్యాచ్ ను కూడా కోల్పోయింది. పంజాబ్ స్పిన్నర్లు రాణించడం, బ్యాటింగ్ లోనూ అదరగొట్టడంతో సొంత గ్రౌండ్ లో చెన్నైని పంజాబ్ చిత్తుగా ఓడించింది.
ఐపీఎల్ 2024లో చెన్నై జట్టు తన 10వ మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో అభిమానులు మరోసారి ధోని బ్యాటింగ్‌ను ఆస్వాదించారు. అయితే ధోని చేసిన ఆ ఒక్కపని తన అభిమానులకు కూడా నచ్చలేదు. దిగ్గజ ప్లేయర్ ఇలా చేయడం నచ్చకపోవడంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఇన్నింగ్స్ చివర్లో కనిపించిన ఈ ఘటనతో ధోనీపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో డారిల్ మిచెల్-ధోని క్రీజులో ఉండి బ్యాటింగ్ చేస్తున్నారు.
undefined
ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టి ధోనీ శుభారంభం చేశాడు. రెండో బంతికే అద్భుతమైన షాట్ కొట్టినా, బంతి బౌండరీకి చేరుకోలేకపోయింది. ఇంతలో, డారిల్ మిచెల్ సింగిల్ కోసం పరిగెత్తాడు, కానీ ధోని అతనిని వెనక్కి పంపాడు. అంటే పరుగులు వచ్చే టైమ్ లో క్రీజులో నుంచి పరుగుకు కాల్ ఇచ్చినా.. అవతలి వైపుకు వెళ్లినా ధోని క్రీజు వదిలి పరుగు తీయడానికి రాలేదు. దీంతో చేసేదేమీ లేక మళ్లీ అక్కడి నుంచి డారిల్ మిచెల్ మళ్లీ తన ప్లేస్ లోకి వచ్చాడు. ఇలా డారిల్ మిచెల్‌కు స్ట్రైక్ ఇవ్వనందుకు అభిమానులు ధోనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ.. తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ గా మారాయి.
Selfish..??
Naah man...He is THALA 🥰🥰 that word and tag is used to target just one man ...VIRAT KOHLI .pic.twitter.com/1HzmXrr1YZ
Daryl Mitchell do run bhaag liya waha pe aur Thala ek bhi nahi🤧 pic.twitter.com/pWagjgQrhu
— N I T I N (@theNitinWalke)
రీతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్..
టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. చెన్నైకి అజింక్యా రహానే, రీతురాజ్ శుభారంభం అందించారు. రహానే 29 పరుగులు చేయగా, గైక్వాడ్ జట్టుకు అండగా నిలిచాడు. చెన్నై వైపు నుంచి నెమ్మదిగా ఆరంభమైంది. కానీ గైక్వాడ్ 48 బంతుల్లో 62 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టు పరువు కాపాడాడు. ఈ ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో సీఎస్కే 162 పరుగుల స్కోరును చేరుకోగలిగింది. 17.5 ఓవర్లలోనే పంజాబ్ టార్గెట్ ను చేధించింది.
ఈ సీజన్‌లో తొలిసారి ధోని ఔట్
ఎంఎస్ ధోని ఐపీఎల్ 2024లో 7 ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. కానీ 8వ ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోయాడు. కానీ ధోనీ వికెట్ ఏ బౌలర్‌కు దక్కలేదు. ఇన్నింగ్స్ చివరి బంతికి రెండు పరుగులు తీసుకునే క్రమంలో ధోని రనౌట్ అయ్యాడు. 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ మరోసారి శుభారంభం చేసింది. వరుసగా ఐదు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ ను పంజాబ్ టీమ్ చిత్తుగా ఓడించింది.
చెన్నై అంటే పంజాబ్ ప్లేయర్లకు పూనకాలే.. వరుసగా ఐదోసారి సీఎస్కేను చిత్తుచేసిన పంజాబ్ కింగ్స్