కెప్టెన్‌ దూకుడుగా ఉంటేనేగా టీమ్‌కు ఊపొచ్చేది: వివ్ రిచర్డ్స్

By sivanagaprasad kodatiFirst Published Dec 22, 2018, 4:32 PM IST
Highlights

పెర్త్ టెస్ట్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ మాటల యుద్ధంపై ఆస్ట్రేలియా మీడియాతో పాటు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు కోహ్లీ తీరును తప్పుబడుతూ పలు రకాలుగా విమర్శిస్తున్నారు. అయితే అంతే స్థాయిలో విరాట్ కోహ్లీకి మద్ధతు పలికేవారు ముందుకు వస్తున్నారు.

పెర్త్ టెస్ట్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ మాటల యుద్ధంపై ఆస్ట్రేలియా మీడియాతో పాటు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు కోహ్లీ తీరును తప్పుబడుతూ పలు రకాలుగా విమర్శిస్తున్నారు. అయితే అంతే స్థాయిలో విరాట్ కోహ్లీకి మద్ధతు పలికేవారు ముందుకు వస్తున్నారు.

కోహ్లీ దూకుడంటే తనకు చాలా ఇష్టమని ఆసీస్ దిగ్గజం డెన్నీస్ లీల్లి వ్యాఖ్యానించగా.. ఇవాళ విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కోహ్లీకి సపోర్ట్‌గా నిలిచారు. ప్రస్తుతం భారత జట్టు 70, 80ల నాటి జట్టు కాదని, విరాట్ లాంటి క్రికెటర్ ఉండటం టీమిండియాకు సానుకూలాంశమన్నారు.

మైదానంలో కోహ్లీ దూకుడును చూసి నేనెంతో ముచ్చటపడతాను. సారథికి దూకుడు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. ఓ జట్టుకు సారథ్యం వహించే వ్యక్తికి అలాంటి లక్షణం ఉండాలని రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. లేకపోతే పోటీతత్వం తగ్గిపోతుంది.

విరాట్‌కి దూకుడెక్కువని విన్నాను.. కానీ అతడిలో అమర్యాద లక్షణం నాకెక్కడా కనిపించలేదు. కోహ్లీలో కష్టపడే తత్వం ఎక్కువ. అతడు జట్టుకు ప్రయోజనం కలిగించే ఉద్దేశ్యంతోనే కష్టపడతాడు. దానినే అందరూ దూకుడు, పొగరు అనుకుంటారు.

కానీ కోహ్లీ లాంటి సారథి ఉండటం వల్లే ఈ రోజు ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా మంచి స్థానం సంపాదించుకోగలిగింది. ప్రస్తుత టెస్ట్ సిరీస్ విషయానికొస్తే ఆసీస్‌కే విజయావకాశాలు ఎక్కువ. కానీ వచ్చే రెండు టెస్టులూ గెలవడానికి టీమిండియాకు అంతకన్నా మంచి అవకాశాలు ముందున్నాయని రిచర్డ్స్‌ అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్-2019 వేలం: ఎవరిని ఎవరు కొన్నారు, సన్‌రైజర్స్ టీమ్ ఇదే

గౌతమ్ గంభీర్‌పై చీటింగ్ కేసు...నోటీసులు జారీ చేసిన డిల్లీ కోర్టు

ఐపీఎల్ వేలంపాటపై తివారీ ఆవేదనతో కూడిన ట్వీట్...

ఏంటి ఆ సీక్రెట్ స్టోరీ..? వైరల్ గా కశ్యప్ ట్వీట్

ఐపీఎల్‌లో రాజోలు కుర్రాడు.. రేటెంతంటే..?

స్పిన్నర్ ఉంటే గెలిచే వాళ్లమేమో: షమీ

జడేజాను కొట్టబోయిన ఇషాంత్.. ఆలస్యంగా వెలుగులోకి

ఓడిపోయిన తర్వాత సెంచరీ గురించి ఎందుకు..?

సంబరపడకండి...ఇంకా రెండు టెస్టులున్నాయ్: గంగూలీ

click me!