సెక్సిస్ట్ రిమార్క్స్: రాహుల్, పాండ్యాలకు శ్రీశాంత్ బాసట

By pratap reddyFirst Published Jan 15, 2019, 10:28 AM IST
Highlights

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో కలిసి పనిచేయాలని ఉందని శ్రీశాంత్ చెప్పాడు. లెజండరీ ఫిల్మ్ మేకర్‌తో కలిసి పనిచేస్తే ఆ గోప్ప అనుభవం జీవితాంతం ఉండిపోతుందని అన్నాడు. 

తిరువనంతపురం: సెక్సిస్ట్ రిమార్క్స్ తో ఆటకు దూరమైన భారత క్రికెటర్లు కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ బాసటగా నిలిచాడు. తనకు సినిమాలంటే చాలా ఇష్టమని, క్రికెట్ కూడా అని, కొద్ది సమయంలోనే తాను తనకు ఇష్టమైనవన్నీ చేశానని అన్నాడు.

పాండ్యా, రాహుల్‌లు మ్యాచ్‌ విన్నర్‌లని, ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనే భారతజట్టుకు వారి సేవలు ఎంతో అవసరమని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. వారు దూరమైతే జట్టుకు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పుకొచ్చాడు.

వారు మాట్లాడింది తప్పే అయినప్పటికి, వారికంటే పెద్ద తప్పులు చేసిన వారు చాలా మంది ఉన్నారని శ్రీశాంత్ తెలిపాడు. వారంతా యధేచ్చగా వారి పనులు వారు చేసుకుంటున్నారని అన్నాడు. 

త్వరలోనే బీసీసీఐ తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తుందని, తన ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు మార్గం సుగమం అవుతుందనిఅన్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్‌.. హిందీ బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.  

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో కలిసి పనిచేయాలని ఉందని శ్రీశాంత్ చెప్పాడు. లెజండరీ ఫిల్మ్ మేకర్‌తో కలిసి పనిచేస్తే ఆ గోప్ప అనుభవం జీవితాంతం ఉండిపోతుందని అన్నాడు. స్పీల్‌బర్గ్‌తో పనిచేస్తే చాలని అన్నాడు. ఆ పాత్ర పెద్దదా, చిన్నదా అనే విషయం తనకు అవసరంలేదని అన్నాడు. 

ఏ క్షణం ఏమైనా జరగొచ్చని తాను నమ్ముతానని, ఆ అద్భుతం కోసం ఎదురుచూస్తున్నానని బిగ్‌బాస్ రన్నరప్ గా నిలిచిన శ్రీశాంత్ చెప్పాడు. కేరళలోని ఓ చిన్న పల్లెటూరులో పుట్టా. అక్కడి నుంచి కేరళ రాష్ట్ర జట్టుకు ఆడే స్థాయికి ఎదిగానని, ఆ తర్వాత భారత జట్టులో ఆడానని అన్నాడు.

ఇప్పుడు టీవీ షోలు, సినిమాలకు పనిచేస్తున్నానని, మున్ముందు ఏమైనా జరగవచ్చనని, నా కల నిజమవుతుందేమోనని శ్రీశాంత్ అన్నాడు. 

సంబంధిత వార్తలు

ఆసీస్ తో వన్డే సిరీస్: పాండ్యా స్థానంలో విజయ్ శంకర్

అనుచిత వ్యాఖ్యలు: హార్డిక్ పాండ్యాకు మరో దెబ్బ

హార్దిక్ పాండ్యా ఎవరు..? ఈషా గుప్త ఫైర్

వారిద్దరూ ఉంటే నా భార్యాకూతుళ్లతో... భజ్జీ సంచలన వ్యాఖ్యలు

ద్రవిడ్ యువతిని ఎలా కన్విన్స్ చేశాడో చూడు...పాండ్యాపై నెటిజన్ల క్లాస్

ఆసిస్ తో వన్డే మ్యాచ్.. ఆ ఇద్దరూ దూరం

పాండ్యా, రాహుల్ కామెంట్లపై స్పందించిన కోహ్లీ

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

click me!