IPL 2020: జాంటీ రోడ్స్ వయసు పెరిగిందంతే... ఫీల్డింగ్‌లో అదే దూకుడు...

By team teluguFirst Published Sep 15, 2020, 10:10 AM IST
Highlights

క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్ ఎవ్వరంటే... మొదటగా వినిపించే పేరు జాంటీ రోడ్స్‌. జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ చేసే వైపు, ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచేవారట. జట్టులో అతని ఫీల్డింగ్‌పైన ఉండే నమ్మకం అలాంటిది. క్రికెటర్‌గా మైదానంలో ఎన్నో మెరుపు విన్యాసాలు చేసిన జాంటీ రోడ్స్...  2003లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

51 ఏళ్ల వయసులో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న జాంటీ... ఇప్పటికీ తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు.

ఐపీఎల్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో జాంటీ రోడ్స్ కళ్లు చెదిరే క్యాచులు అందుకుంటూ యువ ఆటగాళ్లలో ఉత్సాహాం నింపుతున్నాడు. పక్కకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంటున్న జాంటీ వీడియోను పోస్టు చేసిన పంజాయ్ ఎలెవన్ కింగ్స్, ‘మీరు ఈ క్యాచ్ అందుకోగలరా?’ అంటూ ట్వీట్ చేసింది.

క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత హాకీ కూడా ఆడిన జాంటీ రోడ్స్, పంజాబ్ జట్టులో కొత్త జోష్ చూస్తున్నానంటున్నాడు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని పంజాబ్, ఈసారి కప్పు గెలవాలనే కసితో ఉంది.

https://twitter.com/lionsdenkxip/status/1305348042522943488

click me!