యంగ్ అండ్ సీనియర్ స్టార్ ప్లేయ‌ర్ల‌తో భార‌త జ‌ట్టు.. టీ20 వరల్డ్ కప్ 2024 మ‌న‌దే ఇక.. !

By Mahesh RajamoniFirst Published Apr 30, 2024, 4:53 PM IST
Highlights

India T20 World Cup squad : ఐపీఎల్ 2024లో రాణించిన ఆటగాళ్లను నేరుగా టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేయకుండా.. ఇప్పటికే భారత జట్టుకు ఆడి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు ప్రాధాన్య‌త ఇస్తూ బీసీసీఐ భార‌త జ‌ట్టును ఎంపిక చేసింది.  

India T20 World Cup squad :  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్ జూన్ 01 నుండి అమెరికా, వెస్టిండీస్ వేదిక‌లుగా జరగనుంది. ఈ క్ర‌మంలోనే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 కోసం భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) 15 మంది ఆటగాళ్లతో కూడిన భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఇదివ‌ర‌కు భార‌త జ‌ట్టుకు ఆడి ప్ర‌స్తుతం మంచి ఫామ్ లో ఉన్న ప్లేయ‌ర్ల‌తో ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం బలమైన భారత క్రికెట్ జట్టును ప్రకటించింది బీసీసీఐ. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రోహిత్ శర్మకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా మద్దతు ఇవ్వనున్నారు.

ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లను ప్రపంచకప్‌కు నేరుగా ఎంపిక చేయకుండా, ఇప్పటికే భారత జట్టులో ఆడి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయ‌ర్ల‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రాబోయే టీ20 ప్రపంచ కప్ గెలవడమే ల‌క్ష్యంగా సీనియ‌ర్, యంగ్ స్టార్ ప్లేయ‌ర్ల‌తో జ‌ట్టులో చోటుక‌ల్పిస్తూ 15 మంది ఆటగాళ్లను  అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. జైస్వాల్‌తో కలిసి రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నున్నారు.

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. రిషబ్ పంత్, సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకున్నారు. కానీ ఈ టీ20 ప్రపంచకప్ జట్టులో కేఎల్ రాహుల్ చోటు దక్కించుకోలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో మెరుస్తున్న శివమ్ దూబే ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే కేకేఆర్‌కు మ్యాచ్ ఫినిషర్‌గా దృష్టిని ఆకర్షించిన రింకూ సింగ్ 15 మందితో కూడిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు కానీ, రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.

అలాగే, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆల్ రౌండర్లు గా ఉన్నారు. లెగ్‌స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఎంపికయ్యారు. జస్ప్రీత్ బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌కు నాయకత్వం వహించ‌నున్నాడు. అత‌ని తోడుగా మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ లు ఉన్నారు. ఘోర కారు ప్ర‌మాదం నుంచి కోలుకుని ఐపీఎల్ 2024 లో అద‌ర‌గొడుతున్న రిష‌బ్ పంత్ కూడా భార‌త జ‌ట్టులో చోటుద‌క్కించుకున్నాడు.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 కోసం భార‌త జ‌ట్టు: 

రోహిత్ శర్మ (కెప్టెన్), య‌శ‌స్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ సింగ్, అర్ష్‌దీప్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

రిజర్వు ప్లేయర్లు : శుభ్ మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

 

🚨India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced 🚨

Let's get ready to cheer for pic.twitter.com/jIxsYeJkYW

— BCCI (@BCCI)
click me!