IPL2020:తన పని అయిపోలేదు...ఆ స్టన్నింగ్ క్యాచ్ తో నిరూపించిన ధోని

By Arun Kumar PFirst Published Oct 20, 2020, 1:18 PM IST
Highlights

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైరయిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇక ఐపిఎల్ నుండి కూడా రిటైరవ్వాల్సిన సమయం వచ్చిందంటూ కొందరు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. 

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ జట్టుగా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీజన్ 13లో మాత్రం చెత్త ఆటతీరుతో విమర్శలను ఎదుర్కొంటోంది. దీంతో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైరయిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇక ఐపిఎల్ నుండి కూడా రిటైరవ్వాల్సిన సమయం వచ్చిందంటూ కొందరు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. అలాంటి వారికే సమాధానం అన్నట్టుగా సోమవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో వికెట్ వెనకాల చిరుతలా కదులుతూ ధోని అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. మ్యాచ్  ఓడినప్పటికి ఈ క్యాచ్   ద్వారా తన పనయిపోయిందని అంటున్న వారికి ధోని సమాధానం చెప్పాడని చెన్నై అభిమానులు అంటున్నారు. 

సోమవారం జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ధోని సేన ఘోరంగా విఫలమయ్యింది. నిర్ణీత ఓవర్లలో కేవలం 125పరుగులకే ఆ జట్టు పరిమితమయ్యింది. రవీంద్ర జడేజా కాస్త పరవాలేదనిపించగా ధోనీతో సహా మిగతా బ్యాటింగ్ లైనప్ విఫలమయ్యింది. 

దీందో 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు కూడా ఆరంభంలో తడబడింది. ఓపెనర్ బెన్ స్టోక్స్, రాబిన్ ఊతప్ప వికెట్లను కోల్పోయిన కష్టాల్లో వున్న సమయంలో ధోని అందుకున్న ఓ అద్భుతమైన క్యాచ్ ఆ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. గత మ్యాచ్ లో ఇదే చెన్నై జట్టుపై హాఫ్ సెంచరీతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కేరళ కుర్రాడు సంజూ శాంసన్ ను అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు. ధోని పట్టిన ఆ క్యాచ్ విమర్శకుల నుండి ప్రశంసలను పొందుతోంది. 

read more   ఆటలో అన్నిరోజులు మనవికావు.. ధోనీ

ఐపీఎల్ చరిత్రలోనే ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టుకు చుక్కలు చూపించింది 2020 సీజన్. కీలకమైన మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమై, అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది చెన్నై సూపర్ కింగ్స్. 10 మ్యాచుల్లో ఏడు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ఇక్కడి నుంచి ప్లేఆఫ్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే.. 

126 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్, 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యంలో ఇన్నింగ్స్ నిర్మించారు. బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోగా స్టీవ్ స్మిత్ పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో బెన్ స్టోక్స్ 19 పరుగులు చేయగా రాబిన్ ఊతప్ప 4 పరుగులు చేశాడు.

సంజూ శాంసన్ డకౌట్ కాగా... చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో దీపక్ చాహార్ 2, హాజల్ వుడ్ ఓ వికెట్ తీశారు. బట్లర్ 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 34 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
 

click me!