ద్రవిడ్ రికార్డ్ ని కొల్లగొట్టిన కోహ్లీ

By ramya neerukondaFirst Published Dec 27, 2018, 2:54 PM IST
Highlights

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో రికార్డును కొల్లగొట్టారు.  ఇప్పటికే పలు రికార్డులను తన జాబితాలో వేసుకున్న కోహ్లీ.. తాజాగా మరో రికార్డును కైవసం చేసుకున్నాడు.

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో రికార్డును కొల్లగొట్టారు.  ఇప్పటికే పలు రికార్డులను తన జాబితాలో వేసుకున్న కోహ్లీ.. తాజాగా మరో రికార్డును కైవసం చేసుకున్నాడు. విదేశాల్లో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఇండియన్ క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు.

గతంలో ఈ రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. 2002లో విదేశీ గడ్డపై ద్రవిడ్ 1137 పరుగులు చేశాడు. దాదాపు 16ఏళ్ల తర్వాత ఆ రికార్డ్ ని కోహ్లీ బ్రేక్ చేశాడు. ఆసీస్ తో జరుగుతున్న టెస్టులో భాగంగా కోహ్లీ విదేశాల్లో 1138 పరుగులు చేశాడు. విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో కోహ్లీ, ద్రవిడ్ లు మొదటి రెండు స్థానల్లో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో మొహీందర్ అమరనాథ్(1065 పరుగులు), సునీల్ గవాస్కర్(918 పరుగులు) ఉన్నారు.
 

click me!