ఒక్క సింగిల్ తో ఇంగ్లాండ్ 5లక్షల పరుగులు!

By Prashanth MFirst Published Jan 25, 2020, 3:20 PM IST
Highlights

ఇంగ్లాండ్ జట్టు మరో సరికొత్త రికార్డును అందుకుంది. క్రికెట్ కి జన్మనిచ్చిన బ్రిటిష్ టీమ్ సుదీర్ఘ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక టెస్టులు ఆడిన జట్టుగా ఇప్పటికే చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డును సాధించింది.

రీసెంట్ గా ఇంగ్లాండ్ జట్టు మరో సరికొత్త రికార్డును అందుకుంది. క్రికెట్ కి జన్మనిచ్చిన బ్రిటిష్ టీమ్ సుదీర్ఘ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక టెస్టులు ఆడిన జట్టుగా ఇప్పటికే చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డును సాధించింది. మొత్తంగా ఐదు లక్షల పరుగులను చేసిన జట్టుగా నిలిచింది.  దాంతో పాటు విదేశీ గడ్డపై అత్యధిక టెస్టులు ఆడిన జట్టుగా కూడా ఇంగ్లాడ్ రికార్డ్  సృష్టించింది.

సౌత్ ఆఫ్రికాలోని పోర్ట్‌ ఎలిజిబెత్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ ద్వారా ఇంగ్లండ్‌ విదేశీ గడ్డపై ఐదు వందల టెస్ట్ లు ఆడిన జట్టుగా గుర్తింపు దక్కించుకుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో ఇంగ్లాండ్ నాలుగవ టెస్టు ఆడుతోంది. శుక్రవారం ఈ మ్యాచ్ లో కెప్టెన్ రూట్ సింగిల్ రన్ తీయడంతో 5లక్షల పరుగుల మార్కును అందుకుంది. ఇంగ్లాండ్ కి ఇది 1,022వ టెస్టు.

 

ఈ రికార్డుల్లో ఆసీస్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 830 టెస్టుల్లో నాలుగు లక్షల 37 వేల 706 పరుగులు  చేసింది. ఇప్పట్లో ఇంగ్లాండ్ రికార్డును అందుకోవడం ఎవరికి సాధ్యం కానీ పని. ఇక టీమిండియా విషయానికి వస్తే.. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన మూడవ జట్టుగా కొనసాగుతోంది.ఇండియా 540 టెస్టులకు గాను 2,73,518 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ 545 టెస్టులలో 2,70,441 పరుగుల చేసి నాల్గో స్థానంలో కొనసాగుతోంది.

click me!