ICC T20 World Cup 2024 Anthem:  టీ20 ప్రపంచకప్‌ థీమ్‌ సాంగ్ వ‌చ్చేసింది..  ఓ లుక్కేయండి..!

Published : May 02, 2024, 07:26 PM IST
ICC T20 World Cup 2024 Anthem:  టీ20 ప్రపంచకప్‌ థీమ్‌ సాంగ్ వ‌చ్చేసింది..  ఓ లుక్కేయండి..!

సారాంశం

ICC T20 World Cup 2024 Anthem: అమెరికా,వెస్టిండీస్ వేదికగా జూన్‌లో జరిగే ICC పురుషుల T20 ప్రపంచ కప్ అధికారిక గీతం నేడు విడుదలైంది. ఈ గీతం కోసం గ్రామీ అవార్డు విజేత సీన్ పాల్, సోకా సూపర్ స్టార్ కేస్ సహకారం అందించారు. ఈ పాట ఎలా ఉందో మీరు కూడా ఓ లూక్కేయండి.   

ICC T20 World Cup 2024 Anthem: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో 30 రోజుల్లో (జూన్ 2 న)మొదలు కానున్నది. ఈ తరుణంలో ICC గురువారం నాడు టోర్నీకి సంబంధించిన థీమ్‌ సాంగ్ ను ఆవిష్కరించింది. ఈ పాటలో సంగీతం రంగంలోనూ.. క్రీడలు రెండింటిలోనూ అత్యంత ప్రముఖులను చూడవచ్చు. . గ్రామీ అవార్డు గెలుచుకున్న కళాకారుడు సీన్ పాల్,సోకా సూపర్ స్టార్ కేస్ కలిసి 'అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్' అనే గీతాన్ని రూపొందించారు.

గ్రామీ అవార్డు గెలుచుకున్న కళాకారుడు సీన్ పాల్ మరియు సోకా సూపర్ స్టార్ కేస్ ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 కోసం 'అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్' అనే గీతంపై సహకరించారు. టోర్నమెంట్‌కు ముప్పై రోజుల ముందు.. థీమ్ సాంగ్ విడుదలైంది. ఈ పురుషుల పోటీ ప్రపంచ కప్ టోర్నీలో 20 జట్లు 55 మ్యాచ్‌ల్లో పోటీపడ్డనున్నారు.  

ఇకపోతే టీమిండియా టి20 ప్రపంచ కప్ ప్రోమో వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఛానల్(Star Sports) రిలీజ్ చేసింది.
 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?