కోహ్లీ నోట ఇలాంటి మాటలా.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆవేదన

By sivanagaprasad kodatiFirst Published Nov 9, 2018, 12:18 PM IST
Highlights

తన కొత్త యాప్ ప్రమోషన్‌లో భాగంగా అభిమాని మాటలకు సమాధానం ఇచ్చే ప్రయత్నంలో ‘‘ ఈ దేశంలో ఉంటూ పరాయ దేశం క్రికెటర్లను పొగిడేవారు అక్కడికే వెళ్లిపోవచ్చంటూ ’’ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి

తన కొత్త యాప్ ప్రమోషన్‌లో భాగంగా అభిమాని మాటలకు సమాధానం ఇచ్చే ప్రయత్నంలో ‘‘ ఈ దేశంలో ఉంటూ పరాయ దేశం క్రికెటర్లను పొగిడేవారు అక్కడికే వెళ్లిపోవచ్చంటూ ’’ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

దీనిపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. దీనిపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. గత రెండేళ్లుగా అతని మాటల్లో, ప్రవర్తనలో ఎంతో పరిణితితో పాటు హుందాతనం కనిపించింది. కానీ తాజాగా విరాట్ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు.

అతను ఇలా మాట్లాడుతాడనుకోలేదు... అతనేం మాట్లాడాడో ఆ మాటలు ఆహ్వానించదగ్గవి కాదు.. అదే సందర్భంలో తీవ్రంగా నిరాశ పరిచినవి కూడా.. కోహ్లీ మరోలా స్పందించి వుంటే బాగుండేది అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

అభిమానితో సంభాషణ చేస్తుండగా ‘‘ నా దృష్టిలో మీరు అంత గొప్ప బ్యాట్స్‌మెన్ ఏం కాదు.... మీ కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల బ్యాటింగ్ చూడటానికి ఎక్కువ ఇష్టపడతాను.. అనవసరంగా కోహ్లీని ఆకాశానికెత్తేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

దీనికి స్పందించిన విరాట్.. ‘‘ అలా అయితే నువ్వు భారతదేశంలో ఉండటం అనవసరం.. ఈ దేశంలో ఉంటూ పరాయి దేశం వారిని పొగిడేవారు అక్కడికే వెళ్లిపోవచ్చు కదా.. నేను నీకు నచ్చకపోయినా పర్వాలేదు.. కానీ నువ్వు మాత్రం భారత్‌లో ఉండకూడదు అనేది నా అభిప్రాయం.. అంటూ ఘాటుగా బదులిచ్చాడు. అయితే ఈ వీడియోపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో టీమిండియా సారథి వివరణ ఇచ్చాడు..

‘‘ తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని.. ఈ భారతీయులు అంటూ అభిమాని చేసిన వ్యాఖ్యలపైనే నేను స్పందించాను... ఈ దేశంలో ఎవరి ఇష్టం వారిదని నేను గట్టిగా నమ్ముతాను.. పండుగ పూట ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకుండా సరదాగా గడపండి అంటూ వ్యాఖ్యానించాడు. 

వరల్డ్ కప్ కోసం కోహ్లీ ప్రతిపాదన.... వ్యతిరేకించిన రోహిత్

ఫ్యాన్ పై వ్యాఖ్య: చిక్కుల్లో పడిన కోహ్లీ

కోహ్లీవి చెత్త కామెంట్స్.. హీరో సిద్దార్థ్ ఫైర్!

కోహ్లీ పార్టీ ఇవ్వలేదని అలిగి ట్రైన్ ఎక్కిన రవిశాస్త్రి.. నెట్టింట మీమ్స్

అజారుద్దీన్ పై గంభీర్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు

కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ వన్.....

అజారుద్దిన్ ఓ మ్యాచ్ ఫిక్సర్...అతడితో బెల్ కొట్టిస్తారా- బిసిసిఐపై గంభీర్ గరం

‘‘ఇతన్ని పుట్టించినందుకు థ్యాంక్స్ దేవుడా’’...అనుష్క ట్వీట్

అంబటి రాయుడు సంచలన నిర్ణయం

రిషబ్ పంత్ కోసమే.. ధోనీ అలా చేశాడు.. కోహ్లీ
 

click me!