తాగిన మైకంలో యువతి.. రేప్ చేసిన ఎన్ఆర్ఐ

First Published 7, Jul 2018, 1:06 PM IST
Highlights

యువతి మద్యం మత్తులో ఉండటాన్ని అవకాశంగా తీసుకొని ఆమెను రేప్ చేసినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి. 

భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి లండన్ లో 8ఏళ్ల జైలు శిక్ష పడింది. 18ఏళ్ల యువతిని రేప్ చేసినందుకు గాను ఆయనకు అక్కడి న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్ కి చెందిన సంజయ్ నాకేర్(28) ఉద్యోగరిత్యా లండన్ లో స్థిరపడ్డాడు. ఫినాన్స్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నాడు. అతనికి వివాహం కూడా అయ్యింది. అయితే.. ఈయన మద్యం మత్తులో ఉన్న ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం అతనికి 8ఏళ్ల జైలు శిక్ష విధించింది.

 నైట్ క్లబ్ లో పార్టీ చేసుకోవడానికి వెళ్లిన వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో యువతి మద్యం మత్తులో ఉండటాన్ని అవకాశంగా తీసుకొని ఆమెను రేప్ చేసినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే సంజయ్ యువతిని రేప్ చేసినట్లు విచారణలో తేలింది.

సంజయ్.. సదరు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు నైట్ క్లబ్ లోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. వీటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి అతనిని అరెస్టు చేశారు. కాగా.. అసలు ఈ  ఘటన గతేడాది మార్చిలో జరగగా.. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం శుక్రవారం సంజయ్ ని దోషిగా తేల్చింది.

Last Updated 7, Jul 2018, 1:06 PM IST