అస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందారు. ట్రెక్కింగ్ కు వెళ్లిన యువతి ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
న్యూఢిల్లీ:స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన తెలుగు వైద్యురాలు అస్ట్రేలియాలో మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల అస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లోని బాండ్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.అస్ట్రేలియాలోని రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో ఆమె పనిచేస్తున్నారు. స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఈ నెల 2వ తేదీన ట్రెక్కింగ్ కు వెళ్లారు ఉజ్వల. అయితే ట్రెక్కింగ్ కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
undefined
ఉజ్వల భౌతిక కాయాన్ని ఇవాళ టంగుటూరు మండలం ఎలుకపాడులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉజ్వల పేరేంట్స్ కూడ అస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు.చిన్ననాటి నుండి వైద్యురాలు కావాలనే కలను ఉజ్వల నెరవేర్చుకుంది. అయితే ట్రెక్కింగ్ కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు డెడ్ బాడీ వచ్చింది. అక్కడి నుండి ఉంగుటూరు మండలంలోని ఎలుకపాడు గ్రామానికి పార్థీవదేహన్ని తరలించారు. ఈ గ్రామంలోనే ఉజ్వల అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఉజ్వలను కడసారి చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు.