అమెరికాలో మరో భారతీయ సంతతి విద్యార్థి మృతి.. ఈ యేడాది ఐదో ఘటన..

By SumaBala BukkaFirst Published Feb 7, 2024, 2:40 PM IST
Highlights

అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యేడాది ఇప్పటికే 5గురు మృతి చెందారు. 

న్యూఢిల్లీ : అమెరికాలో భారత సంతతికి చెందిన మరో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఏడాది ఇలా మృతి చెందిన ఐదవ ఘటన ఇది. సమీర్ కామత్ అనే భారత సంతతి విద్యార్థి అమెరికా, ఇండియానాలోని పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ చదువుతున్నారు. సోమవారం సాయంత్రం నేచర్ రిజర్వ్‌లో కామత్ మృతజీవిగా ఉండడం గుర్తించారు. ఈ మేరకు వారెన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ఒక ప్రకటనలో ధృవీకరించింది.

23 ఏళ్ల కామత్ 2023 ఆగస్టులో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. కామత్ కు యుఎస్ పౌరసత్వం ఉందని ప్రకటన పేర్కొంది. కామత్ తన డాక్టరల్ ప్రోగ్రామ్‌ను 2025లో పూర్తి చేయబోతున్నాడు. కామత్ మృతిపై ఫోరెన్సిక్ శవపరీక్ష నిర్వహించిన అనంతరం నివేదికను  విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి.. వీడియోలు వైరల్...

పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న మరో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి నీల్ ఆచార్య చనిపోయిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. నీల్ ఆచార్య తల్లి మిస్సింగ్ రిపోర్టుతో అతని మృతి వెలుగు చూసింది. నీల్ ఆచార్య మృతదేహం  క్యాంపస్ గ్రౌండ్ లో లభ్యమైంది.

గత వారం, 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి ఓహియోలో శవమై కనిపించాడు. ఈ కేసులో ఏదైనా ఫౌల్ ప్లే లేదా ద్వేషపూరిత నేరం జరిగే అవకాశం లేదని అధికారులు తోసిపుచ్చారు.

జార్జియాలోని లిథోనియాలో ఎంబీఏ చదువుతున్న వివేక్ సైనీ జనవరి 16న నిరాశ్రయుడైన వ్యక్తి దాడి చేయడంతో మరణించాడు. ఈ సంఘటనలు యునైటెడ్ స్టేట్స్‌లో భారతీయ విద్యార్థి సంఘం ఆందోళనకు కారణం అయ్యింది. దీంట్లో 300,000 కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉన్నారు. 

click me!