షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..

By SumaBala Bukka  |  First Published Feb 10, 2024, 8:54 AM IST

అపరిచితుడి దాడిలో గాయపడిన ఓ ఇండో-అమెరికన్ చికిత్స తీసుకుంటూ వాషింగ్టన్ లో మృతి చెందాడు. అతని మీద గతవారం దాడి జరిగింది. 


వాషింగ్టన్ : అమెరికాలో భారతీయులపై దాడులు, భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యేడాది కాలంలో ఇప్పటికే ఐదుగురు విద్యార్థులు అనుమానాస్పదంగా మరణించగా... హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని అతని అపార్ట్ మెంట్ ముందే నలుగురు వ్యక్తులు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్, వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో మరొకరు చేశారు. ఓ  భారతీయ-అమెరికన్ మృతి చెందాడు. ఈ వారం ప్రారంభంలో వాషింగ్టన్ రెస్టారెంట్ వెలుపల జరిగిన పోరాటంలో ప్రాణాంతక గాయాలతో చికిత్స పొందుతున్న వర్జీనియాకు చెందిన వివేక్ తనేజా మరణించాడు.

నిందితుడు, బాధితుడు ఇద్దరూ ఘటన జరిగిన ఫిబ్రవరి 2న రెండు జపనీస్ రెస్టారెంట్లలో ఉన్నట్లు పోలీసు గుర్తించినట్లు తెలిపారు. బాధితుడిని "అనుమానితుడు నేలపై పడేశాడు. తలను పేవ్‌మెంట్‌ కేసి కొట్టాడు" అని వాషింగ్టన్ పోస్ట్ పోలీసులు తెలిపారు. యుఎస్‌లో భారతీయులు, భారతీయ-అమెరికన్‌లపై అనేక దాడుల క్రమంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. 

Latest Videos

undefined

అమెరికాలో మరో భారతీయ సంతతి విద్యార్థి మృతి.. ఈ యేడాది ఐదో ఘటన..

తనేజా, 41, తెల్లవారుజామున 2 గంటల సమయంలో రెస్టారెంట్ల నుండి బయలుదేరాడు. సమీపంలోని వీధిలో గొడవ జరిగిందని.. గొడవ ఎందుకు జరిగిందో వివరించకుండా.. పోలీసుల నివేదిక పేర్కొంది. దాడిలో బాధితుడు స్పృహ కోల్పోయాడు.  పోలీసులు అక్కడికి వచ్చేసరికి ప్రాణాపాయ గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుడి ఫొటోను పోలీసులు షేర్ చేశారు.  సీసీటీవీలో కనిపించిన నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడిని ఇంకా గుర్తించలేదు. అతని ఆచూకీ తెలిపిన వారికి, లేదా ఘటనకు సంబంధించి ఏదైనా క్లూ ఇచ్చేవారికి 25,000 డాలర్ల రివార్డ్‌ను ప్రకటించారు. 

ఈ వారం ప్రారంభంలో, చికాగోలో దొంగలు దాడి చేయడంతో ఒక భారతీయ విద్యార్థి ముక్కు, నోటి నుండి రక్తస్రావం అయిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే వ్యక్తి దాడికి గురయ్యాడు. ఈ ఏడాది అమెరికాలో మరో నలుగురు భారతీయ సంతతి విద్యార్థులు మరణించినట్లు సమాచారం.అమెరికా పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్న 19 ఏళ్ల విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగెర్ గత వారం చనిపోయినట్లు గుర్తించారు, అయితే అధికారులు దీనిని నిర్ధారించారు.
 

click me!