ఏప్రిల్ 30 న వంచన దినం ; ఎపి సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్

First Published Apr 24, 2018, 2:44 PM IST
Highlights

చంద్రబాబు ప్రచారానికే ఎల్లో మీడియా 

టిడిపి, బిజెపిలు ఇప్పటికి మంచి సత్సంబందాలను ఒప్పందాన్ని కల్గిఉండి తెలుగు ప్రజలను మోసం చేసే పనిలో ఉన్నాయని వైఎస్సార్ సిపి నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అయితే ఈ ఒప్పందం బహిరంగంగా కాకుండా లోపాయికారిగా జరిగిందని అన్నారు. ఇందుకు నిదర్శనమే చంద్రబాబు, గవర్నర్ ల భేటీ అని బొత్స వివరించారు. 

కేంద్రంతో ఏ సీఎం పోరాడని విధంగా ఎపి సీఎం చంద్రబాబు పోరాడుతున్నాడని ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా గవర్నర్ తో సమావేశంలో ఏం మాట్లాడుకున్నారో ఎందుకు బైటపెట్టడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తనపై కేంద్రం చర్యలు తీసుకోనుందన్న సమాచారంతోనే బాబు గవర్నర్ తో భేటీ అయ్యి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఈ ఎన్నికల తర్వాత సీఎంపై చర్యలు లేకుంటే లాలూచీ పడినట్లేనని తెలిపారు.

బిజెపి, టిడిపి లు కలిసి ఏప్రిల్ 30  తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను తప్పారని గుర్తు చేశారు. అందుకు నిరసనగా ఈ నెల 30ని ''వంచన దినం'' గా  పాటించనున్నట్లు, ప్రజలు కూడా ఆ రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

చివరి బడ్జెట్ సమావేశాల సమయంలోనే వైసిపి ఎంపిల్లాగా టిడిపి ఎంపిలు రాజీనామ చేసిఉంటే కేంద్రం దిగివచ్చేదన్నారు బొత్స. ఇలా చేయకుండా టిడిపి ఎంపిలు వెనుకడుగేయడంతో కేంద్రం ప్రత్యేక హోదా డిమాండ్ ను పట్టించుకోలేదని తెలిపారు.

ఇక ఒక్కసారి ఓటేసినందుకు బలహీన వర్గాలను టిడిపి పార్టీ అణగదొక్కుతోందని బొత్స వివరించారు. బిసిలు జడ్జీలు, డిజిపిలు కావద్దా? అంటూ ;ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు జస్టిస్ ఈశ్వరయ్య లేఖపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. కావాలనే ఈశ్వరయ్య లేఖను ఎల్లో మీడియా హైలైట్ చేయడం లేదని, చంద్రబాబును కాపాడటమే ఈ ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందన్నారు.కొన్ని మీడియా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలను, సామాజిక వర్గాలనే టార్గెట్ చేసుకున్నాయన్నారు. ఇలా కుల రాజకీయాలు చేస్తున్న టిడిపికి ఏపిలో నూకలు చెల్లిపోయాయని ఘాటుగా విమర్శించారు.

 

click me!