సెక్స్ కి ముందు ఏంతింటున్నారో.. ఓ లుక్కేయండి

First Published Feb 5, 2018, 3:56 PM IST
Highlights
  • పుట్టబోయే బిడ్డపై కీలక ప్రభావం చూపనున్న తండ్రి ఆహారం
  • తండ్రి ఆహారమే కీలకమంటున్న పరిశోధకులు 

బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి.. ఇది తినాలి.. ఇది తినొద్దు.. టైమ్ కి మందులు వేసుకోవాలి.. ఇలా కాబోయే అమ్మలకు చాలా సూచనలు చేస్తారు కుటుంబ సభ్యులు, వైద్యులు. తల్లి సరైన ఆహారం తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది కాబట్టి.. ఈ సూచనలు చేస్తారు. అయితే.. తల్లి తీసుకునే ఆహారం ఎంత ప్రభావం చూపుతుందో.. తండ్రి తీసుకునే ఆహారం కూడా బిడ్డ మీద అంతే ప్రభావం చూపిస్తుందట. అదేలా? బేబీని కడుపున మోసేది అమ్మ కదా. అమ్మ సరిగా తింటే సరిపోతుంది? నాన్న డైట్ తో ఏమిటి సంబంధం?

సంబంధం ఉంది. బిడ్డ కడుపులో పడి తర్వాత అమ్మ డైట్ మెయిన్ టైన్ చేయాలి.  అయితే..  భార్యభర్తలు సెక్స్ లో పాల్గొనడానికి ముందు భర్త తీసుకునే డైట్ తో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ముడిపడి ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. భర్త మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. ఆ తర్వాత సెక్స్ లో పాల్గొంటే.. పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారని అమెరికాలోని సిన్సినాటి యూనివర్శిటీ ప్రొఫెసర్ మైకెల్ పోలాక్ తెలిపారు.

ఈ విషయంపై పలు పరిశోధనలు జరిపిన తర్వాత ఇది నిరూపితమైందని పోలాక్ తెలిపారు. ఇదే సంఘటనను ఆయన ఈగ జీవితకాలంతో పోల్చి వివరించారు.  డ్రోసోఫిలా మెలనోగ్రాస్టర్ జాతికి చెందిన ఈగలపై ఇదే విషయంపై పరిశోధనలు జరిపినట్లు ఆయన తెలిపారు. ఈ రకం ఈగ కళ్లు ఎర్రగా ఉంటాయి. ఈ రకం ఈగ ఒక్కొక్కటి రోజుకి 50గుడ్లు పెట్టగలదు. దాని జీవితకాంలో తక్కువలో తక్కువ 2వేల గుడ్డు పెట్టగలదు. అయితే.. ఆడ ఈగలు ఎప్పటిలాగే సాధారణ ఆహారమే తీసుకుంటాయట. కానీ మగ ఈగలు మాత్రం ఈస్ట్, షుగర్ లాంటి 30రకాల ఫుడ్ తీసుకుంటుందట.

ఎక్కువగా ఈ మగ ఈగలు బేకరీల్లో కనపడతాయి. అందులో ఉండే ఆహారాన్ని తీసుకుంటాయి. 17రోజుల పాటు మంచి డైట్ ఫాలో అయిన తర్వాత ఒక్కో మగ ఈగ.. రెండు ఆడ ఈగలతో సంపర్కంలో పాల్గొంటాయట. అందుకే ఆ ఈగల్లో సంతానాభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

కాబట్టి సెక్స్ ముందు మగవారు న్యూట్రీషన్ ఫుడ్ తీసుకున్నట్లయితే.. ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద కచ్చితంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

click me!