తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ ; ఏడుగురు మావోల మృతి

First Published Apr 27, 2018, 1:01 PM IST
Highlights

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ తెలంగాణ-చత్తీస్‌గఢ్‌ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టు నక్సలైట్లు మృతిచెందారు. 

తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా అన్నారం-మర్రిమర్ల అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చత్తీస్ ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచారు. ఈ నిఘా వర్గాల సమాచారంతో గత కొన్ని రోజులుగా గ్రేహౌండ్స్ దళాలు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఈ కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్న గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టు నక్సలైట్లు తారపడ్డారు. దీంతో పోలీసులకు, మావోయిస్టులకు మద్య కాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోలు చనిపోయారు. ఇంకా కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

గత కొన్ని రోజులుగా బలగాలు మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేసింది. దీంతో ఇటీవల మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లలో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలతో భాగా ఎదురుదెబ్బ తిన్న మావోయిస్టులకు తాజాగా ఎన్‌కౌంటర్‌లో తో మరింత పెద్దఎత్తున దెబ్బతగిలిందని చెప్పవచ్చు.
 
 
 
 

click me!