ఉత్తరప్రదేశ్‌లో ఓ దొంగ బాబా తనను తాను ఓ కుటుంబానికి పరిచయం చేసుకుని, వారి బిడ్డపై దెయ్యం ఉన్నదని నమ్మించాడు. ఆ కుటుంబం నమ్మి బిడ్డను ఆ దొంగబాబాతో పంపింది. ఆమెను బైక్ పై తీసుకెళ్లి గుడి వెనుకాలి గదిలో రేప్ చేసి మూడు గంటలు బయట తింపాడు. ఆ యువతి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
లక్నో: సమాజంలో ఇప్పటికీ మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మోసగాళ్ల చేతిలో తీవ్రంగా నష్టపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఇలాగే మోసపోయింది. ఓ మోసగాడు తనను ఒక మంత్రగాడిగా చెప్పుకుని, దెయ్యాలు వదిలిస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన తల్లిదండ్రులు బిడ్డను ఆయనతో పంపించారు. ఆ దుర్మార్గుడు యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని బదోహిలో చోటుచేసుకుంది.
మిర్జాపూర్‌కు చెందిన ఓ కుటుంబం సీతామర్హికి వచ్చింది. అక్కడ మోతీలాల్ అనే ఓ ‘స్వామి’ని కలిశారు. తనను తాను ఒక తాంత్రికుడిగా, దెయ్యలు, ప్రేతాత్మలను పారదోలుతానని నమ్మించాడు. మిర్జాపూర్ నుంచి వచ్చిన కుటుంబం ఆ మాటలు నమ్మింది. వారి 18 ఏళ్ల బిడ్డపై దెయ్యం ఉన్నదని, ఆ దెయ్యాని వదిలిస్తే ఆమె బాగుంటుందని చెప్పాడు. అంతేకాదు, వారి బిడ్డను ఆయనతో ఒంటరిగా పంపించాలని సూచించాడు. మోతీలాల్ మాటలు నమ్మిన ఆ కుటుంబం బిడ్డను ఆయనతో పంపించింది.
దెయ్యం పంపించడానికి క్రతువుల కోసం రూ. 4000 ఆ కుటుంబం నుంచి లాక్కున్నాడు.
గురువారం సాయంత్రం మోతీలాల్ వద్దకు ఆ యువతిని ఆమె తండ్రి తీసుకుని వెళ్లాడు. ఆ యువతిని మోతీలాల్ తన బైక్ పై కూర్చోబెట్టుకుని దార్వాసి గ్రామంలోని ఓ గుడి వెనుకాలే ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడే యువతిని రేప్ చేశాడు. మూడు గంటలు ఆమెను బయటకు తీసుకెళ్లాడు. తన వద్దకు మళ్లీ రేపు రావాలని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని పోలీసులు తెలిపారు.
Also Read: బీ ఫారాలు అందుకున్న ఆ ఇద్దరు: 51 మందికే బీఆర్ఎస్ బీ ఫారాలు(వీడియో)
బాధితురాలు తన కుటుంబానికి జరిగిన ఘటనను మొత్తం వివరించింది. ఆ తర్వాత తండ్రి మోతీలాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ మీనాక్షి కాత్యాయన్ తెలిపారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కిడ్నాప్, రేప్, చీటింగ్, బెదిరింపుల కింద కేసు ఫైల్ అయింది. యువతిపై రేప్ జరిగినట్టు మెడికల్ పరీక్షలో తేలిందని కాత్యాయన్ వివరించారు. కోర్టులో ఆమె స్టేట్‌మెంట్ తర్వాత మోతీలాల్‌ను పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు.