బీ ఫారాలు అందుకున్న ఆ ఇద్దరు: 51 మందికే బీఆర్ఎస్ బీ ఫారాలు(వీడియో)
తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఆదివారం నాడు బీ ఫారాలను అందించారు. 51 మంది అభ్యర్థులకు ఇవాళ కేసీఆర్ అందించారు. మిగిలిన వారికి రేపు బీ ఫారాలు అందించనున్నారు.
హైదరాబాద్:ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారంనాడు భీ ఫారాలు అందించారు. ఇవాళ 51 మంది అభ్యర్ధులకు బీ ఫారాలను సీఎం కేసీఆర్ అందించారు. రేపు మిగిలిన అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలను అందించనున్నారు.
నిన్నటివరకు మంచి రోజులు లేనందున బీ ఫారాలపై ఇవాళ ఉదయమే సంతకాలు చేసినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు. మంచి రోజులు లేనందున ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సంతకాలు చేయవద్దని సూచించడంతో బీ ఫారాలపై సంతకాలు చేయలేదని కేసీఆర్ ప్రకటించారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి అనారోగ్యంతో మరణించారు. దీంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున కవిత బీ ఫాం అందుకున్నారు. మరో వైపు కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారు. కామారెడ్డి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కేసీఆర్ తరపున బీ ఫారం అందుకున్నారు.ఒక్కో అభ్యర్ధికి రెండు బీ ఫారాలను కేసీఆర్ అందించారు. బీ ఫారాల సెట్ ను పార్టీ అభ్యర్ధులకు సీఎం కేసీఆర్ అందించారు. ఒక్కో అభ్యర్థి పేరును పిలిచి బీ ఫారాలు అందించారు.
అంతకుముందు ఎన్నికల సమయంలో ఏ రకంగా ప్రచారం నిర్వహించాలి, కార్యకర్తల నుండి నేతలతో ఎలా సమన్వయం చేసుకోవాలనే విషయాలపై కేసీఆర్ దిశా నిర్ధేశం చేశారు.
also read:తెలంగాణలో విజయం మనదే: అభ్యర్థులతో కేసీఆర్
నిజామాబాద్, ఖమ్మం,మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల అభ్యర్ధులకు సీఎం కేసీఆర్ బీ ఫారాలు అందించారు. బీ ఫారాలు అందని స్థానాల్లో మార్పులు జరుగుతాయా అనే ప్రచారం కూడ సాగుతుంది. అయితే ఉపన్యాసం ప్రారంభంలో ఈ విషయమై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తామని గతంలో పదే పదే ప్రకటించామన్నారు. అదే విధంగా సిట్టింగ్ లకే టిక్కెట్లు కేటాయించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. నాలుగైదు అసెంబ్లీ స్థానాల్లో విధిలేని పరిస్థితుల్లో అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని కేసీఆర్ ప్రస్తావించారు.
ఇవాళ బీ ఫారాలు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే....
1. కోనేరు కోనప్ప
2. దుర్గం చిన్నయ్య
3. ఎన్. దివాకర్ రావు
4.కోవా. లక్ష్మి
5. భూక్యా జాన్సన్ నాయక్
6. జోగు రామన్న
7.అనిల్ జాదవ్
8.ఇంద్రకరణ్ రెడ్డి
9.విఠల్ రెడ్డి
10.కె.చంద్రశేఖర్ రావు
11. షకీల్
12. హనుమంత్ షిండే
13. పోచారం శ్రీనివాస్ రెడ్డి
14.జె.సురేందర్
15.బి. గణేష్ గుప్తా
16.బాజిరెడ్డి గోవర్థన్
17.వి.ప్రశాంత్ రెడ్డి
18. పట్నం నరేందర్ రెడ్డి
19.ఎస్.రాజేందర్ రెడ్డి
20.డాక్టర్ సి. లక్ష్మారెడ్డి
21.ఆల. వెంకటేశ్వర్ రెడ్డి
22.వి.శ్రీనివాస్ గౌడ్
23.సిహెచ్. రామ్మోహన్ రెడ్డి
24.సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
25. బి. కృష్ణమోహన్ రెడ్డి
26.మర్రి జనార్థన్ రెడ్డి
27.గువ్వల బాలరాజు
28.జైపాల్ యాదవ్
29.అంజయ్య యాదవ్
30.హర్షవర్ధన్ రెడ్డి
31.పద్మా దేవేందర్ రెడ్డి
32.ఎం.భూపాల్ రెడ్డి
33.చంటి క్రాంతి కిరణ్
34.జి.మహిపాల్ రెడ్డి
35.కె. ప్రభాకర్ రెడ్డి
36.రేగా కాంతారావు
37.హరిప్రియానాయక్
38. పువ్వాడ అజయ్ కుమార్
39.కందాల ఉపేందర్ రెడ్డి
40.కె.కమల్ రాజ్
41.బాణోత్ మదన్ లాల్
42. వనమా వెంకటేశ్వరరావు
43.మెచ్చా నాగేశ్వరరావు
44. సండ్ర వెంకట వీరయ్య
45. తెల్లం వెంకటరావు
46. కేటీఆర్
47.పైళ్ల శేఖర్ రెడ్డి
48.టి. హరీష్ రావు
49.ఎ.జీవన్ రెడ్డి
50.బాల్క సుమన్
51.పల్లా రాజేశ్వర్ రెడ్డి