అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెను దిరిగిన మహిళలు, ఎందుకంటే?

By narsimha lodeFirst Published Oct 19, 2018, 11:34 AM IST
Highlights

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం సమీపంలోకి వచ్చిన  ఇద్దరు మహిళలు  స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు

శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం సమీపంలోకి వచ్చిన  ఇద్దరు మహిళలు  స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. దీంతో కొంత టెన్షన్ వాతావరణం చల్లబడింది.

సుప్రీంకోర్టు  తీర్పు నేపథ్యంలో  అయ్యప్ప ఆలయంలోకి   ప్రవేశించేందుకు శుక్రవారం నాడు ఇద్దరు  మహిళలు  వచ్చారు.  పోలీసులు భారీ బందోబస్తు మధ్య వారిద్దరిని ఆలయ సమీపంలోకి తీసుకెళ్లారు.

నిరసనకారుల ఆందోళనల మధ్య  ఆ ఇద్దరు మహిళలను పోలీసులు సురక్షితంగా ఆలయ సమీపంలోకి తీసుకొచ్చారు.  అయితే మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే  తాము ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ  అర్చకులు ప్రకటించారు

ఈ పరిణామాల నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకొనేందుకు  వచ్చే  భక్తులకు తమ వల్ల ఇబ్బందులు ఏర్పడకూడదనే ఉద్దేశ్యంతో  ఆ ఇద్దరూ మహిళలు కూడ  ఆలయంలోకి ప్రవేశించకుండానే వెనుదిరిగారు.

అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి  కందారు రాజీవరు  కూడ  ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే  తాను ఆలయాన్ని మూసివేస్తానని శుక్రవారం నాడు తేల్చి చెప్పారు.

మహిళలు ఆలయ సమీపంలోకి రాగానే  ప్రధాన పూజారి మరోసారి ఇదే విషయాన్ని గుర్తు చేశారు.  తమ వల్ల భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ఆ ఇద్దరు మహిళలు కూడ స్వామివారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.

సంబంధిత వార్తలు

శబరిమల వద్ద ఇంకా ఉద్రిక్తత: గుడికి 200 మీటర్ల దూరంలో మహిళలు

సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదు: శబరిమల వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

శబరిమలలో ఉద్రిక్తతే: న్యూయార్క్ టైమ్స్ లేడీ జర్నలిస్టుపై దాడి

శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తత: తెరుచుకున్న తలుపులు

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి వెళ్లే మహిళలపై రాళ్ల దాడి, లాఠీచార్జీ

శబరిమల దాకా వెళ్లి వెనక్కి మళ్లిన ఏపీ మహిళ

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి ప్రవేశం కోసం మహిళల యత్నం, రాళ్లదాడి

ఇరుపక్షాల పట్టు: శబరిమల వద్ద ఉద్రిక్తత

శబరిమలలో యుద్ధమేనా... అడుగుపెట్టేందుకు, అడ్డుకునేందుకు రెడీ అయిన మహిళలు

శబరిమలకు వెళ్తా: ఫేస్‌బుక్‌లో మహిళా పోస్టు, హెచ్చరికలు

శబరిమల ఆలయంలోకి మహిళలు.. ‘‘స్టే’’కు సుప్రీం నో..!!

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం

శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల

శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

 

click me!