ధోనీ టాకింగ్ పాయింట్: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 13, 2019, 5:45 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

అందుకే ధోనీని అలా పంపించాం: విమర్శలపై రవిశాస్త్రి

న్యూజిలాండ్ పై జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో మహేంద్ర సింగ్ ధోనీని చివరలో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు పంపించడానికి గల కారణంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి వివరణ ఇచ్చారు. అది టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయమని ఆయన అన్నారు. ధోనీని కాస్తా ముందుగా బ్యాటింగ్ కు పంపించి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఆ వివరణ ఇచ్చారు. 
 

 

ఇండియా ఓటమికి ధోనీయే కారణం: నిప్పులు చెరిగిన యోగరాజ్

భారత్ ఓటమిపై ఓ క్రీడా ఛానెల్‌తో యోగరాజ్ సింగ్ ధోనీపై నిప్పులు చెరిగారు. డెత్‌ఓవర్లలో ధోనీ నెమ్మదిగా ఆడి రవీంద్రజడేజాపై ఒత్తిడి తెచ్చాడని ఆయన ఆరోపించారు.రవీంద్ర జడేజా కీలకమైన దశలో బ్యాటింగ్‌కు వచ్చి ఏమాత్రం భయం లేకుండా భారీ షాట్లు ఆడసాగాడని, మరోవైపు దోనీ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాఢని ఆయన అన్నారు. 

 

 

కమెడియన్ పృథ్వీకి కీలక పదవి ఇచ్చిన వైఎస్ జగన్

తన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడమే కాకుండా పార్టీ కోసం ప్రచారం చేసిన తెలుగు కమెడియన్ పృథ్వికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన పదవిని అప్పగించారు.
 

 

 

మింగుడు పడని కేశినేని, బుద్ధా వెంకన్న గరం: చంద్రబాబుకు తలనొప్పి

విజయవాడ: ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు సద్దుమణగడం లేదు. విజయవాడ తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తీరు చంద్రబాబుకు మింగుడు పడడం లేదని అంటున్నారు. 

 

 

పచ్చజెండా ఊపితే టీడీపీ ఖాళీ: మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్య

తమ పార్టీ అధిష్టానం పచ్చ జెండా ఊపితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని, అధిష్టానం అనుమతి కోసం వేచి చూస్తున్నామని బిజెపి నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు అన్నారు. 
 

 

కిషన్ రెడ్డి కొలువులో ఆమ్రపాలి: కేసీఆర్ కోర్టులో బంతి

తెలంగాణ ప్రభుత్వం అనుమతి లభిస్తే ఐఎఎస్ అధికారి ఆమ్రపాలి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి కొలువులో చేరనున్నారు. కిషన్ రెడ్డి ప్రైవేట్ కార్యదర్శిగా ఆమ్రపాలిని నియమించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. అయితే, అందుకు తెలంగాణ ప్రభుత్వం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. 
 

 

నా వ్యక్తిగత విషయాలపై టీఆర్ఎస్ ఆరా...ఎందుకోసమంటే: జగ్గారెడ్డి

తన నియోజకవర్గం సంగారెడ్డిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాను ఉద్యమిస్తుంటే ప్రభుత్వం మాత్రం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అందువల్లే తనను అక్రమంగా అరెస్టులు చేయించడం జరుగోతోందని ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా విమర్శించడం తర్వాత చేద్దురుగానీ ముందు ప్రజల సమస్యలపై దృష్టిసారించాలంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వానికి చురకలు అంటించారు. 
 

 

రిస్క్ ఎందుకని.. మళ్లీ డీవీడీనే నమ్ముకుంటున్న సమంత

సమంత, నందిని రెడ్డిల కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘జబర్దస్త్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత  చాలా గ్యాప్ తీసుకుని వీరిద్దరూ కలిసి ‘ఓ బేబీ’ సినిమా చేశారు. ఈసారి హిట్ అవటం వీళ్లద్దరికి కలిసి వచ్చింది. రిలీజైన మొదటిరోజు మార్నింగ్ షోకే  సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లను రాబడుతోంది.  ఈ ఉత్సాహంతోనే వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యారట. అందులో ఆశ్చర్యమేమీ కూడా లేదు. 
 

 

తమ్ముడి సినిమాపై విజయ్ దేవరకొండ కామెంట్!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం 'దొరసాని'. జీవిత, రాజశేఖర్ ల రెండో కుమార్తె శివాత్మిక ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాని ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.
 

 

హైదరాబాద్ లో ఫ్యాషన్ షో... అందాలతో హీటెక్కించిన ముద్దుగుమ్మలు

హైదరాబాద్ లో మిర్రర్ సెలూన్స్ కొత్తగా మరో సెలూన్ ను ప్రారంభించింది. మాదాపూర్ లో సెలూన్ హెయిర్ క్రష్ పేరుతో నూతన సెలూన్ ఏర్పాటయ్యింది. ఈ సందర్భంగా దస్ పల్లా హూటల్లో ఈ నూతన  బ్రాండ్ ఆవిష్కరణ కార్యాక్రమం జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ, క్రీడా  ప్రముఖులు హాజరయ్యారు. 

 

 

నా వోడ్కా నేనే తెచ్చుకుంటా.. వర్మ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.

 

 

కామెంట్ చేసి ఇరుక్కుపోయిన స్టార్లు..!

ఒక్కోసారి మన సెలబ్రిటీలు తమ అభిప్రాయం చెప్పే క్రమంలో కొన్ని స్టేట్మెంట్ ఇస్తుంటారు.. అవి కాస్త కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతుంటాయి. 

 

 

శ్రీదేవిది హత్యే.. స్పందించిన బోనీకపూర్!

అతిలోక సుందరి శ్రీదేవి గతేడాది బాత్ టబ్ లో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెది అసహజ మరణమని.. కుట్ర చేసి చంపేశారంటూ వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె మరణించి ఏడాది దాటినా.. ఇప్పటికీ సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీదేవిది హత్యేనని.. ఆమె మరణంలో కుట్రకోణం దాగి ఉందంటూ కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆరోపణలు చేశారు.
 

 

 

నన్ను ఇరికించి డబ్బు సంపాదించాలనుకున్నాడు.. హీరోయిన్ కామెంట్స్!

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై తాజాగా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ లో ఢిల్లీకి చెందిన ఓ ఈవెంట్ మేనేజర్ సోనాక్షిపై కేసు పెట్టారు. ఓ ఈవెంట్ లో డాన్స్ చేస్తానని ఒప్పుకున్న సోనాక్షి పారితోషికంగా రూ.24 లక్షలు అడిగారట.

 

 

''తెలంగాణాలో ఆంధ్రా సినిమాలు చూడ‌టం లేదా?''

దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన మాస్ ఎంటర్టైనర్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకురానుంది. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా మొత్తం తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. సినిమాలో ప్రధాన పాత్రలు తెలంగాణా యాసతోనే మాట్లాడతాయి.

 

 

 

click me!