టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.

ఈ సినిమాను జూలై 18న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మరో కొత్త ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. దీనిపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

''పూరి ఈజ్ బ్యాక్.. తన మార్క్ మాస్ మసాలా టేకింగ్, పంచ్ డైలాగ్స్ తో ఇస్మార్ట్ శంకర్ తీశాడు. రామ్ ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. నిధి అగర్వాల్ చాలా హాట్ గా కనిపిస్తోంది. ఛార్మి మేం తొలిరోజు తొలిఆటకు సిద్ధమవుతున్నాం'' అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై స్పందించిన పూరి కృతజ్ఞతలు తెలిపారు. ఛార్మి స్పందిస్తూ.. ఇస్మార్ట్ శంకర్ ఫుల్ మీల్స్ లాంటి సినిమా  అంటే దానికి వర్మ.. 'అయితే పార్టీకి నా వోడ్కా నేనే తెచ్చుకుంటా' అంటూ బదులిచ్చాడు. దీనికి ఛార్మి.. 'వోడ్కాతో పాటు ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ కాపీ తీసుకొని మీ దగ్గరకి వస్తున్నాను. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం' అంటూ ట్వీట్ చేశారు.