విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం 'దొరసాని'. జీవిత, రాజశేఖర్ ల రెండో కుమార్తె శివాత్మిక ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాని ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

ప్రివ్యూ చూసిన చాలా మంది సెలబ్రిటీలు మాత్రం సినిమా బాగుందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్రమోషన్స్ లో కూడా సపోర్ట్ చేయలేదు.

అయితే ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరై యూనిట్ ని అభినందించారు. సినిమా విడుదలైన తరువాత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టి చిత్రబృందాన్ని అభినందించాడు.

''యువ నటీనటులను చూసి గర్వపడుతున్నాను. మై బాయ్.. ఐ లవ్యూ సో మచ్. కానీ నీకంటే రాజునే ఎక్కువగా ఇష్టపడుతున్నాను. శివాత్మిక పెర్ఫార్మన్స్ అధ్బుతంగా ఉంది. కథ నిజంగానే జరిగినట్లు తమ పెర్ఫార్మన్స్ తో ఆవిష్కరించిన నటీనటుల కారణంగా సినిమా చూడడానికి అధ్బుతంగా ఉంది. కె.వి.ఆర్.మహేంద్ర, ప్రశాంత్ విహారి, సన్నీ కూరపాటి మీరు నిజంగా సూపర్. త్వరలోనే మన దారులు కలుస్తాయని అనుకుంటున్నారు. సినీ లవర్స్ ని ఈ సినిమా మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్'' అంటూ రాసుకొచ్చాడు.