March 5-Top Ten News: టాప్ టెన్ వార్తలు

By Mahesh K  |  First Published Mar 5, 2024, 5:54 PM IST

ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు.
 


బీఆర్ఎస్, బీఎస్పీల దోస్తీ

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోసిన బీఎస్పీ తిరిగి ఆ పార్టీతోనే దోస్తీ పెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు మంగళవారం భేటీ అయ్యారు. పూర్తి కథనం

Latest Videos

undefined

సంగారెడ్డి సభలో మోడీ వ్యాఖ్యలు

కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. సంగారెడ్డిలో బీజేపీ విజయసంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ తనను విమర్శిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నానని  ప్రధాని మోడీ చెప్పారు. పూర్తి కథనం

విశాఖలో ప్రమాణ స్వీకారం.. పగటి కలలు

చ్చే ఎన్నికల అనంతరం విశాఖ నుంచి పాలన సాగిస్తానని, మళ్లీ గెలిచి వచ్చాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఒక్క ఏపీ ప్రజలే కాదు.. యావత్ ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. పూర్తి కథనం

ప్రణీత్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో సస్పెన్షన్ వేటు

హైదరాబాద్:  గతంలో  స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)లో డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన దుగ్యాల ప్రణీత్ రావును  తెలంగాణ ప్రభుత్వం సోమవారంనాడు సస్పెండ్ చేసింది.ఈ మేరకు తెలంగాణ డీజీపీ రవిగుప్తా  సోమవారంనాడు  ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి కథనం

టీడీపీకి వైసీపీ మంత్రి

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)కి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా  గుమ్మనూరు జయరాం  ప్రకటించారు. మంగళవారం నాడు  విజయవాడలో మంత్రి గుమ్మనూరు జయరాం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. పూర్తి కథనం

ఇండియా దేశం కాదు.. ఉపఖండం

డీఎంకే లోక్ సభ ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అనేది ఒక దేశం కాదని పేర్కొంటూ కొత్త వివాదాన్ని రేపారు. జై శ్రీరాం, భారత్ మాతా కీ జై అనే నినాదాలను ఆయన తప్పుపట్టారు. పూర్తి కథనం

సివిల్ డ్రెస్సులోనైనా భారత బలగాలు ఇక్కడ ఉండొద్దు

మాల్దీవుల అధ్యక్షుడు మొహమద్ ముయిజ్జు మరోసారి తన భారత వ్యతిరేక వైఖరిని వెళ్లగక్కారు. మాల్దీవుల్లో భారత మిలిటరీ ఉండటానికి వీల్లేదని అన్నారు. సివిల్ డ్రెస్‌లో ఉన్నా సరే భారత మిలిటరీని అంగీకరించబోమని చెప్పారు. పూర్తి కథనం

వ్యర్థాల నుంచి బంగారం

ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి లాభసాటి మార్గంలో బంగారాన్ని వెలికితీయడాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రూ. 1 పెట్టుబడితో రూ. 50 లాభాన్ని పొందే విధంగా ఈ ప్రక్రియను వారు కనిపెట్టారు. పూర్త కథనం

ఏడు దశల్లో ఎన్నికలు?

లోక్ సభ ఎన్నికల కోసం మార్చి 14 లేదా 15న షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 2019 మాదిరిగానే ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ‘ఏబీపీ న్యూస్’ కథనం పేర్కొంది. ఏప్రిల్ రెండో వారంలో మొదటి దశ పోలింగ్ జరిగేందుకు ఆస్కారం ఉంది. పూర్తి కథనం

భర్తను పోలుస్తూ అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్

అనసూయ భరద్వాజ్ (Anasuya) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.  తన సినిమాల అప్డేట్స్ ను అందించడంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. భర్త కోసం పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. పూర్తి కథనం

click me!