పలు సంచలను తీర్పులు వెలువరించి రాజకీయ చర్చలకు తీసేలా చేసిన కోల్ కత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేశారు. గురువారం ఆయన బీజేపీలో చేరబోతున్నారు. దీంతో గత కొంత కాలంగా ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి.
కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. మార్చి 7వ తేదీన (గురువారం) బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ ను ఎదుర్కొనే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు. పార్టీలో తన పాత్రపై ఎలా ఉండాలనే విషయం అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.
కర్ణాటకకు వరుస బాంబు బెదిరింపులు.. అధికార యంత్రాంగం అలెర్ట్.. దర్యాప్తు ప్రారంభం..
వ్యక్తిగత కారణాలతో రాజీనామా లేఖను అధ్యక్షుడు ద్రౌపది ముర్ముకు పంపించారు. తన లేఖ ప్రతులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానంలకు పంపారు. కొంతమంది న్యాయవాదులు, కక్షిదారులు తన రాజీనామాను పునఃపరిశీలించవలసిందిగా అభ్యర్థించారని, కానీ తనకు చేయాల్సిన ఇతర పనులు కూడా ఉన్నాయని తెలిపారు.
ఎంకే స్టాలిన్ ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’.. ఫ్లెక్సీలో బ్లండర్ మిస్టేక్.. వైరల్
ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ లో విద్యకు సంబంధించిన పలు అంశాలపై గంగోపాధ్యాయ ఇచ్చిన తీర్పులు రాజకీయ చర్చలకు దారి తీశాయి. అయితే గతంలో ఆయనను ‘రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా’అని మీడియా ప్రశ్నించింది. కానీ దానిపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. కాగా. 24 ఏళ్లపాటు హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత, జస్టిస్ గంగోపాధ్యాయ మే 2, 2018న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా చేరారు.