Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. బీఆర్ఎస్, బీఎస్పీల దోస్తీ..

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.

BRS and BSP dosti. Decision to contest parliamentary elections in alliance..ISR
Author
First Published Mar 5, 2024, 5:02 PM IST

తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోసిన బీఎస్పీ తిరిగి ఆ పార్టీతోనే దోస్తీ పెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు మంగళవారం భేటీ అయ్యారు. 

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు సమావేశమై పొత్తుపై చర్చలు జరిపారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంలో ఇద్దరు నేతల మధ్య జరిగింది. అయితే ఈ పొత్తుకు సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు.
హైకోర్టు న్యాయమూర్తి రాజీనామా.. మార్చి 7న బీజేపీలో చేరిక..

ఈ పొత్తుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి కొంత సమయం తరువాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పొత్తుపై వారిద్దరూ ప్రకటన చేస్తారని తెలుస్తోంది

Follow Us:
Download App:
  • android
  • ios