కర్ణాటకకు వరుస బాంబు బెదిరింపులు.. అధికార యంత్రాంగం అలెర్ట్.. దర్యాప్తు ప్రారంభం..

By Sairam IndurFirst Published Mar 5, 2024, 2:43 PM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్స్ పంపించారు. దీంతో అక్కడి అధికార యంత్రాంగం అలెర్ట్ అయ్యింది.

కర్ణాటక  ప్రభుత్వ అధికారులు, బహిరంగ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికార యంత్రాగం అలెర్ట్ అయ్యింది. ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో వేగంగా స్పందించిన అధికారులు.. దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

ఎంకే స్టాలిన్ ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’.. ఫ్లెక్సీలో బ్లండర్ మిస్టేక్.. వైరల్

మెయిల్ పంపించిన నేరస్థులను గుర్తించడానికి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈమెయిల్ ద్వారా పంపిన బెదిరింపులు ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి సహా ప్రముఖులను టార్గెట్ చేసుకొని ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం 2.48 గంటలకు పట్టణంలో బాంబు పేలుళ్లు జరుగుతాయని 'షాహిద్ ఖాన్' పేరుతో ఎవరో పంపిన బెదిరింపు మెయిల్స్ ద్వారా హెచ్చరించినట్లు సమాచారం.

మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్ధోషి.. మావోయిస్టుల లింకు కేసులో బాంబే హైకోర్టు తీర్పు.. 

బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లతో పాటు అంబారీ ఉత్సవాల్లో పేలుడు పదార్థాలను అమర్చినట్లు పేర్కొన్నారు. బెదిరింపులు రావడంతో రంగంలోకి దిగిన అధికారులు సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తక్షణ దర్యాప్తు ప్రారంభించారు.

మార్చి మధ్యలోనే లోక్ సభ ఎన్నికలకు నగారా?.. 7 దశల్లో నిర్వహించే ఛాన్స్

కాగా.. బెంగళూరు పోలీస్ కమిషనర్ కు మరో బెదిరింపు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బెదిరింపుల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి బాధ్యులను గుర్తించే పనిలో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసుల బృందం నిమగ్నమైంది. దీనిపై అధికారులు సమాధానాలు వెతికే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు కర్ణాటక వ్యాప్తంగా భద్రతా చర్యలను పెంచడంతో పాటు కీలక ప్రాంతాల్లో నిఘా, గస్తీని పెంచారు.

click me!