Asianet News TeluguAsianet News Telugu

ఇండియా దేశం కాదు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఉనికే ఉండదు: డీఎంకే ఎంపీ రాజా షాకింగ్ కామెంట్స్

డీఎంకే ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అనేది దేశం కాదని, భారత్ ఒక ఉపఖండం అని వివరించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉనికే ఉండదని అన్నారు.
 

india is not a country dmk mp a raja rakes another controversy kms
Author
First Published Mar 5, 2024, 2:30 PM IST

డీఎంకే లోక్ సభ ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అనేది ఒక దేశం కాదని పేర్కొంటూ కొత్త వివాదాన్ని రేపారు. జై శ్రీరాం, భారత్ మాతా కీ జై అనే నినాదాలను ఆయన తప్పుపట్టారు. ఏ రాజా గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. హిందూయిజం అనేది దేశానికి, అలాగే ప్రపంచానికి కూడా ఒక సమస్యే అని పేర్కొన్నారు. తాజాగా, మరోసారి ఆయన వివాదాన్ని రేపారు.

ఇండియా అనేది ఒక దేశం కాదని ఏ రాజా అన్నారు. అయితే, ఇది ఒక ఉపఖండం అని వివరించారు. తమిళం ఒక దేశం, మలయాళం ఒక దేశం, ఒడియా ఒక దేశం.. ఇలా అనేక దేశాలతో ఏర్పడిందే భారత ఉపఖండం అని తెలిపారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి ఈ ఉనికే గల్లంతు అవుతుందని పేర్కొన్నారు.

Also Read: LokSabah Polls: తెలంగాణలో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఒపీనియన్ పోల్స్ అంచనాలివే

బీజేపీ ఐటీ శాఖ హెడ్ అమిత్ మాలవీయా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. డీఎంకే నుంచి వరుసగా విద్వేష ప్రసంగాలే వస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపు ఇచ్చారని, ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ ఏ రాజా మరో వివాదాన్ని రేపారని తెలిపారు. డీఎంకే నుంచి ఒక క్రమబద్ధంగానే విద్వేష పూరిత వ్యాఖ్యలు వస్తున్నాయని, వీటికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios