Mar 30, 2025, 11:57 PM IST
Telugu news live updates: RR vs CSK: ధోని-జడేజాలు చెన్నైని గెలిపించలేకపోయారు.. రాజస్థాన్ సూపర్ విక్టరీ


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో పంచాంగ శ్రవణం ఉండనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు జరపనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరుకానున్నారు. టీడీపీ ఆఫీసులో పంచాంగ శ్రవణం జరగనుంది. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..
11:57 PM
RR vs CSK: ధోని-జడేజాలు చెన్నైని గెలిపించలేకపోయారు.. రాజస్థాన్ సూపర్ విక్టరీ
IPL 2025 RR vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 11వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. నితీష్ రాణా, జోఫ్రా ఆర్చర్ లు ఈ గెలుపులో హీరోలుగా నిలిచాడు.
పూర్తి కథనం చదవండి11:38 PM
కేకేఆర్ వద్దంటే.. ఆర్ఆర్ తరఫున 225 స్ట్రైక్ రేటుతో సునామీ రేపిన నితీష్ రాణా
Nitish Rana: ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ వద్దనుకుంటే రాజస్థాన్ రాయల్స్ టీమ్ లోకి వచ్చి సునామీ ఇన్నింగ్స్ తో పరుగుల వర్షం కురిపించాడు నితీష్ రాణా. చెన్నై సూపర్ కింగ్స్ పై ధనాధన్ ఇన్నింగ్స్ తో సూపర్ నాక్ ఆడాడు.
11:01 PM
IND vs AUS: ఐపీఎల్ మధ్యలో భారత్-ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ !
India Tour of Australia 2025: భారత జట్టు 5 టీ20, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఐపీఎల్ మధ్య దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
9:59 PM
IPL 2025 DC Vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటిమికి 5 కారణాలు ఇవే
Five Reasons for SRH's Defeat: ఐపీఎల్ 2025లో అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చిత్తుగా ఓడించింది. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో డీసీ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
పూర్తి కథనం చదవండి8:53 PM
ఎంపురాన్ మూవీ వివాదం : ఆ సన్నివేశాలు తొలగిస్తాం, క్షమాపణ కోరిన మోహన్ లాల్
ఎంపురాన్‌తో సంబంధించి వివాదంపై మోహన్‌లాల్ క్షమాపణ చెప్పారు.
పూర్తి కథనం చదవండి8:16 PM
మూడు రోజుల్లోనే పీఎఫ్ డబ్బులు మీ ఖాతాల్లోకి.. EPFO కొత్త మార్పులు: ఏప్రిల్ 1, 2025 నుండి అమలు
EPFO New Rules : ఏప్రిల్ 1, 2025 తర్వాత పీఎఫ్ డబ్బులు తీసుకోవడం మరింత సులభం కానుంది. ఈ మేరకు EPFO (Employees’ Provident Fund Organization) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులు ఫీఎఫ్ కు అప్లై చేసుకుంటే కేవలం 3 రోజుల్లోనే, అది కూడా ఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్ లైన్ లోనే డబ్బులు పొందొచ్చు. EPFO కొత్త మార్పుల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి8:05 PM
IPL: డబుల్ సెంచరీ.. ఐపీఎల్ 2025లో మిచెల్ స్టార్క్ కొత్త రికార్డు !
Mitchell Starc: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మిచెల్ స్టార్క్ అదరగొడుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ను తన బౌలింగ్ తో దెబ్బకొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కు సూపర్ విక్టరీని అందించాడు. అలాగే, ఐపీల్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు.
7:53 PM
హార్దిక్ పాండ్యా: మళ్లీ అదే తప్పు!
Hardik Pandya Fined: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నెమ్మదిగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించారు.
పూర్తి కథనం చదవండి7:05 PM
DC Vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో ఓటమి ! ఢిల్లీ అదరగొట్టింది బాసూ !
IPL 2025 DC Vs SRH: అభిషేక్ పోరెల్ భారీ సిక్సర్ బాది ఢిల్లీ క్యాపిటల్స్ కు ఐపీఎల్ 2025లో రెండో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ 2025 10వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
6:27 PM
కాంతార హీరో రిషబ్ శెట్టి ఉగాది సెలెబ్రేషన్స్, ఆవుల్ని ప్రత్యేకంగా పూజించిన పాన్ ఇండియా స్టార్, వైరల్ ఫొటోస్
నటుడు రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టి, పిల్లలతో కలిసి గుడికి వెళ్లారు. అక్కడ ఉగాది జరుపుకున్నారు. పండుగ వేడుకల అందమైన ఫోటోలు ఇవి.
పూర్తి కథనం చదవండి5:41 PM
Zelensky: అగ్రరాజ్యానికి షాక్ ఇచ్చిన జెలెన్‌స్కీ.. అమెరికా ఆర్మీ సాయం అప్పుగా ఒప్పకోమని స్పష్టీకరణ.
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సీరియస్ అయ్యారు. అమెరికా ఆర్మీ సాయాన్ని ఉక్రెయిన్ అప్పుగా ఎప్పటికీ ఒప్పుకోదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు..
పూర్తి కథనం చదవండి5:32 PM
Aniket Verma: సన్‌రైజర్స్ హైదరాబాద్ లో మరో కొత్త స్టార్.. వైజాగ్ లో ఇరగదీశాడు ! ఎవరీ అనికేత్ వర్మ?
Aniket Verma IPL 2025 DC Vs SRH: తన కెరీర్ లో తొలి ఐపీఎల్ సీజన్ ను ఆడుతున్న అనికేత్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.
పూర్తి కథనం చదవండి4:52 PM
Hacker Attacks: మీరు క్రోమ్ వాడుతున్నారా? హ్యాకర్లు దాడి చేసే ఛాన్స్ ఉంది. ఈ సేఫ్టీ టిప్స్ పాటించండి
Hacker Attacks: గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక. క్రోమ్ బ్రౌజర్ డేంజర్ లో పడింది. దీనిపై సైబర్ నేరగాళ్లు దాడులు చేసే అవకాశాలున్నాయి. వెంటనే బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవడంతో పాటు ఈ టిప్స్ పాటిస్తే మీ డేటా, మనీ సేఫ్ గా ఉంటాయి.
పూర్తి కథనం చదవండి4:19 PM
PM Modi: వైద్య విద్యలో సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం: నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నాగ్ పూర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ (Madhav Netralaya) కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తూ, అర్హులైన డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పీఎం నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు..
పూర్తి కథనం చదవండి
4:16 PM
DC Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాకిచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ! స్టార్క్ దెబ్బ అదుర్స్ !
IPL 2025 DC Vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఒక్క పరుగుకే రనౌట్ అయ్యాడు.
4:02 PM
Best Mileage Scooter: రూ.74 వేలకే 62 కి.మీ. మైలేజ్ ఇచ్చే ఈ సూపర్ స్కూటర్ ఫీచర్స్ అద్భుతం
లోకల్ తిరగడానికి బెస్ట్ మైలేజ్ స్కూటర్ కోసం చూస్తున్నారా? టీవీఎస్ అందిస్తోంది స్కూటీ జెస్ట్ 110. స్టైలిష్ డిజైన్ తో సిటీలో తిరగడానికి కంఫర్ట్‌బుల్‌గా ఉండేలా టీవీఎస్ కంపెనీ ఈ స్కూటర్ ని తయారు చేసింది. దీని ఫీచర్స్, మైలేజ్, ధర తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి3:40 PM
రష్మిక కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ : గీత గోవిందం నుంచి పుష్ప 2 వరకు
సికిందర్ నటి రష్మిక మందన్న కెరీర్‌లోని ఉత్తమ చిత్రాల గురించి చూద్దాం. ఆమె పని పట్ల అంకితభావం, అభిరుచిని ప్రతిబింబిస్తాయి.
పూర్తి కథనం చదవండి3:40 PM
Business Idea: భూమి ఉన్న వారికి సిరుల పంట.. నెలకు రూ. లక్ష సంపాదించే అవకాశం
ఒకప్పుడు వ్యవసాయం అంటే నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల వారు మాత్రమే చేసే వృత్తి అనుకునే వారు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసిన వారు కూడా కొలువులు మానేసి వ్యవసాయంవైపు మొగ్గు చూపుతున్నారు. వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అలాంటి ఒక ఉత్తమ పంట గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
3:22 PM
Exercise: ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత ఇవి అస్సలు తినకూడదు
Exercise: ఈ రోజుల్లో ఎక్సర్‌సైజ్ రెగ్యులర్ గా చేస్తేనే ఆరోగ్యంగా ఉండగలం. అయితే వ్యాయామం చేసేటప్పుడు చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తారు. ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ తినడం హెల్త్ కి మంచిది కాదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
3:04 PM
సుమన్ జైలుకు వెళ్లడం వల్ల అదృష్టం కలిసొచ్చి స్టార్ అయింది ఎవరో తెలుసా, చిరంజీవి కాదు
నటుడు సుమన్ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. అందగాడు కూడా. కెరీర్ జోరందుకుంటున్న తరుణంలో జరిగిన సంఘటన వల్ల సుమన్ కొన్ని నెలలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీనిపై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి2:38 PM
Mann Ki Baat: అది భారత్‌కు సవాలుగా మారనుంది.. మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ కీలక ప్రస్తావన
ప్రతీ నెల చివరి ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పలు అంశాల గురించి పీఎం ప్రస్తావిస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఆదివారం మోదీ పలు కీలక విషయాలను పంచుకున్నారు..
పూర్తి కథనం చదవండి2:16 PM
సూర్య- జ్యోతిక ఇంట్లో త్రిష, రమ్యకృష్ణ హీరోయిన్ల సందడి, పార్టీలో స్పెషల్ ఏంటంటే?
సూర్య, జ్యోతిక తమ ఇంట్లో హీరోయిన్ల కోసం గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ పార్టీ ఎందుకు? దేనికోసం
పూర్తి కథనం చదవండి1:15 PM
PM Modi: నాగ్‌పూర్ పర్యటనలో నరేంద్ర మోదీ.. దీక్షాభూమిని సందర్శించిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ నాగ్ పూర్ లో ఆదివారం పర్యటించారు. ఇందులో భాగంగా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాధవ్ నేత్రాలయ ఐ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మోదీ నాగ్ పూర్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
పూర్తి కథనం చదవండి12:43 PM
Jio Plans: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్: రూ.75కే అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్‌లు
Jio Plans: జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ని తీసుకొచ్చింది. జస్ట్ రూ.75కే అన్‌లిమిటెడ్ కాల్స్ తో పాటు అవసరమైనంత డేటాను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి12:09 PM
Betting Apps: అన్వేష్ ఏమైనా మంచోడా.? బెట్టింగ్ యాప్స్‌కి అతనే కారణం. టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అంశం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. బడా స్టార్‌లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు పోలీసుల విచారణ సైతం ఎదుర్కొన్నారు. అయితే తొలి నుంచి ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోన్న విషయం తెలిసిందే..
11:05 AM
Donald Trump: ట్రంప్ దెబ్బ అమెరికన్లు అబ్బా.. టాయిలెట్ పేపర్లకు తప్పని తిప్పలు
అమెరికా ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే అమెరికాకు మేలు చేసే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ట్రంప్. అయితే ఇదే సమయంలో ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అమెరికా ప్రజల ప్రజల ప్రయోజనాలు సైతం దెబ్బ తీస్తున్నాయా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
10:12 AM
Venu Swamy: విడాకులు, భూకంపాలు మరెన్నో.. విశ్వావసు నామ సంవత్సరం చాలా డేంజర్. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
ఉగాది పండగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉగాది అనగానే మొదట గుర్తొచ్చేది పచ్చడి ఆ తర్వాత పంచాంగం. ఈ ఏడాది రాశి ఫలాల ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అంచనా ప్రకారం ఈ ఏడాది ఎలాంటి సంఘటనలు జరగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
9:15 AM
దేవాలయాలకు హాఫ్ కిలోమీటర్ దూరంలో మాంసం అమ్మకాలపై నిషేధం.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.
చైత్ర నవరాత్రులు మొదలయ్యేలోపే అక్రమ కబేళాలను మూసేయాలని, గుళ్ల చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో మాంసం అమ్మకూడదని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ ఏంటా రాష్ట్రం, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి8:36 AM
Today Rasi Phalalu: ఉగాది పండగ రోజున ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసా?
ఉగాది పండగ రోజున ఏ రాశి వారికి ఎలా ఉండనుందో ఇక్కడ తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 30.03.2025 ఆదివారానికి సంబంధించినవి.