- Home
- Sports
- Cricket
- Aniket Verma: సన్‌రైజర్స్ హైదరాబాద్ లో మరో కొత్త స్టార్.. వైజాగ్ లో ఇరగదీశాడు ! ఎవరీ అనికేత్ వర్మ?
Aniket Verma: సన్‌రైజర్స్ హైదరాబాద్ లో మరో కొత్త స్టార్.. వైజాగ్ లో ఇరగదీశాడు ! ఎవరీ అనికేత్ వర్మ?
Aniket Verma IPL 2025 DC Vs SRH: తన కెరీర్ లో తొలి ఐపీఎల్ సీజన్ ను ఆడుతున్న అనికేత్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.

Aniket Verma: Another new star in Sunrisers Hyderabad.. Amazing batting in Vizag, who is Aniket Verma?
Aniket Verma IPL 2025 DC Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 10వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) - సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడ్డాయి. విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో వరుసగా స్టార్ ప్లేయర్ల వికెట్లు కోల్పోయి హైదరాబాద్ టీమ్ కష్టాల్లో పడిన సమయంలో యంగ్ ప్లేయర్ అనికేత్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల సునామీ రేపాడు.
ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ లోనే అభిషేక్ శర్మ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత 3వ ఓవర్ లో ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి రూపంలో మరో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అనికేత్ వర్మ ఒక వైపు వికెట్లు పడుతున్న తన అద్భుతమైన ఆటతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
who is Aniket Verma?
వరుస సిక్సర్లు, ఫోర్లు కొడుతూ 34 బంతుల్లో ఐపీఎల్ లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. తన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత కూడా అద్భుతమైన షాట్స్ ఆడుతూ గ్రౌండ్ ను హోరెత్తించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అద్భుతమైన క్రాకింగ్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత బంతిని కూడా బిగ్ షాట్ ఆడాడు కానీ, టైమింగ్ కుదరకపోవడంతో ఫ్రేజర్-మెక్ గుర్క్ కు బౌండరీ లైన్ వద్ద క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. ఈ మ్యాచ్ లో అనికేత్ వర్మ 41 బంతుల్లో 74 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.
Aniket Verma: Another new star in Sunrisers Hyderabad.. Amazing batting in Vizag, who is Aniket Verma?
ఎవరీ అనికేత్ వర్మ?
23 ఏళ్ల అనికేత్ వర్మ ఫిబ్రవరి 5, 2002న ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ తరఫున అనేక అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అలాగే, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగలడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (MPPL)లో తన దూకుడు బ్యాటింగ్ శైలి, పవర్-హిట్టింగ్ సామర్ధ్యాలతో గుర్తింపు పొందాడు. ఈ లీగ్ లో అతను 6 ఇన్నింగ్స్‌లలో 195 స్ట్రైక్ రేట్‌తో 273 పరుగులు చేశాడు. అందులో అందులో అద్భుతమైన సూపర్ ఇన్నింగ్స్ లు ఉన్నాయి.
MPPL లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును కూడా సాధించాడు. 2024 డిసెంబర్ లో హైదరాబాద్‌తో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున తన T20 అరంగేట్రం చేశాడు. కర్ణాటక U-23తో జరిగిన పురుషుల అండర్-23 వన్డే ఇంటర్-స్టేట్ టోర్నమెంట్, ఆల్-ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో సెంచరీలు సాధించాడు.
అనికేత్ వర్మ ఐపీఎల్ ఎంట్రీ అదిరింది!
IPL 2025 మెగా వేలంలో అనికేత్ వర్మను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. తన తొలి ఐపీఎల్ సీజన్ ఆడుతున్న అతను మార్చి 23, 2025న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన IPL 2025 రెండవ మ్యాచ్‌లో IPL అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ లో 3 బంతుల్లో 1 సిక్స్‌తో 7 పరుగులు చేశాడు.
మార్చి 27, 2025న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన IPL 2025 7వ మ్యాచ్‌లో అతను 13 బంతుల్లో 36 పరుగుల ఇన్నింగ్స్ లో 5 సిక్సర్లు బాదాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. అనికేత్ వర్మ తన దూకుడు బ్యాటింగ్, ఆల్ రౌండర్ సామర్థ్యంతో మరో బిగ్ హిట్టర్ హైదరాబాద్ టీమ్ కు దొరికాడు.