MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • సుమన్ జైలుకు వెళ్లడం వల్ల అదృష్టం కలిసొచ్చి స్టార్ అయింది ఎవరో తెలుసా, చిరంజీవి కాదు

సుమన్ జైలుకు వెళ్లడం వల్ల అదృష్టం కలిసొచ్చి స్టార్ అయింది ఎవరో తెలుసా, చిరంజీవి కాదు

నటుడు సుమన్ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. అందగాడు కూడా. కెరీర్ జోరందుకుంటున్న తరుణంలో జరిగిన సంఘటన వల్ల సుమన్ కొన్ని నెలలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీనిపై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 30 2025, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Suman

Suman

నటుడు సుమన్ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. అందగాడు కూడా. కెరీర్ జోరందుకుంటున్న తరుణంలో జరిగిన సంఘటన వల్ల సుమన్ కొన్ని నెలలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీనిపై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. కొందరు అయితే చిరంజీవిని నిందిస్తూ కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ వాస్తవం అది కాదు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Suman

Suman

అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్, ఓ పోలీస్ అధికారి పన్నిన వ్యూహంలో సుమన్ చిక్కుకుపోయారు. ఇదే వాస్తవం అని చాలా మంది చెబుతుంటారు. సుమన్ జైలుకు వెళ్లిన తర్వాత చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అయితే సుమన్ జైలుకి వెళ్లిన తర్వాత చిరంజీవి కంటే బాగా కలసి వచ్చి స్టార్ అయిన హీరో ఒకరు ఉన్నారు. 

36

ఈ విషయాన్ని సాయి కుమార్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు, 1985లో వందే మాతరం అనే చిత్రంలో సుమన్ హీరోగా నటించాల్సింది. కానీ కొన్ని సమస్యల వల్ల సుమన్ ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. అంతకు ముందు రాజశేఖర్ విలన్ గా నటించేవారు. రాజశేఖర్ నటన నిర్మాత శ్రీకృష్ణ కి నచ్చింది. వందే మాతరం చిత్రంలో సుమన్ ప్లేస్ లో రాజశేఖర్ ని తీసుకుందాం అని చెప్పారు. 

46
suman, rajasekhar

suman, rajasekhar

అప్పటి వరకు నేను సుమన్ కి డబ్బింగ్ చెప్పేవాడిని. రాజశేఖర్ కి అంతవరకు డబ్బింగ్ చెప్పలేదు. సుమన్ హీరో అయితే నేనే డబ్బింగ్ చెప్పేవాడిని. ఇప్పుడు హీరో రాజశేఖర్. ఆయనకి ఎవరు డబ్బింగ్ చెప్పాలి అనే సమస్య ఎదురైంది. నిర్మాత ఏమో నన్నే చెప్పామన్నారు. కానీ నేను కూడా ఆ చిత్రంలో నటిస్తున్నాను. కాబట్టి నేను చెబితే బాగోదు అని చెప్పా. లేదు నువ్వే చెప్పాలి.. నీ పాత్రకి వేరే స్లాంగ్ లో చెప్పుకో.. అప్పుడు రెండు వాయిస్ లు వేరు వేరుగా ఉంటాయి అని నిర్మాత అన్నారు. ఆ చిత్రంతోనే రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించా. 

56

అదే టైంలో సుమన్ జైలుకి వెళ్లారు. దీనితో సుమన్ చిత్రాలు ఆగిపోయాయి. ఈ గ్యాప్ లో నా వాయిస్ రాజశేఖర్ కి బాగా సెట్ అయిపోయింది. సినిమాలు సూపర్ హిట్ కావడంతో రాజశేఖర్ పాపులర్ అయ్యారు. ప్రేక్షకులు కూడా రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ ఇదే అని భావించేవారు. నేను డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలియదు. సుమన్ జైలు నుంచి తిరిగి వచ్చాక సమస్య మొదలైంది. సుమన్ తిరిగి సినిమాలు చేయడం ప్రారంభించారు. 

66

రాజశేఖర్ కి నా వాయిస్ బాగా అలవాటైపోయింది. రాజశేఖర్ కి నువ్వు డబ్బింగ్ చెప్పడానికి వీల్లేదు అని సుమన్ నాతో గొడవ పెట్టుకున్నారు. రాజశేఖర్ కూడా అంతే.. నువ్వు నాకు మాత్రమే చెప్పాలి.. సుమన్ కి చెప్పకూడదు అని వార్నింగ్ ఇచ్చేవారు. నా వాయిస్ కోసం వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. దీనితో సుమన్ కి సాఫ్ట్ గా, రాజశేఖర్ కి గంభీరంగా చెప్పాలనే ఒప్పందం జరిగింది. నేను కూడా సినిమాలు చేయడం ప్రారంభించిన తర్వాత జనాలు ఏమనేవారంటే.. ఇతనికి రాజశేఖర్ డబ్బింగ్ చెప్పినట్లు ఉన్నారు అనేవారు అని సాయి కుమార్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved