MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Hacker Attacks: మీరు క్రోమ్ వాడుతున్నారా? హ్యాకర్లు దాడి చేసే ఛాన్స్ ఉంది. ఈ సేఫ్టీ టిప్స్ పాటించండి

Hacker Attacks: మీరు క్రోమ్ వాడుతున్నారా? హ్యాకర్లు దాడి చేసే ఛాన్స్ ఉంది. ఈ సేఫ్టీ టిప్స్ పాటించండి

Hacker Attacks: గూగుల్ క్రోమ్‌ యూజర్లకు హెచ్చరిక. క్రోమ్ బ్రౌజర్ డేంజర్ లో పడింది. దీనిపై సైబర్ నేరగాళ్లు దాడులు చేసే అవకాశాలున్నాయి. వెంటనే బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవడంతో పాటు ఈ టిప్స్ పాటిస్తే మీ డేటా, మనీ సేఫ్ గా ఉంటాయి.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 30 2025, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ఒక ముఖ్యమైన సెక్యూరిటీ లోపం బయటపడింది. దీనికి CVE-2025-2783 అని పేరుపెట్టారు. ఈ లోపం కారణంగా యూజర్లపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంది. ఫిషింగ్ ఈ-మెయిల్స్, హానికరమైన లింక్స్ ద్వారా హ్యాకర్లు ఈ లోపాన్ని ఉపయోగించి క్రోమ్ సెక్యూరిటీని కూడా దాటేస్తున్నారు. వారి వలలో పడకుండా ఉండాలంటే యూజర్లు వెంటనే తమ బ్రౌజర్లను అప్‌డేట్ చేసుకోవడం అవసరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ముఖ్యంగా మీడియా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ఎడ్యుకేషన్ సంస్థలు ఈ సైబర్ దాడుల ప్రమాదంలో ఉన్నాయి. ఇంటర్నెట్ సెక్యూరిటీని అందించే కాస్పర్స్కీ కి చెందిన ‘గ్లోబల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్’ (GReAT) ఈ లోపాన్ని కనుగొనింది. దీనికి CVE-2025-2783 అని పేరు పెట్టింది.

ఈ లోపం వల్ల హానికరమైన లింక్‌ను క్లిక్ చేసిన యూజర్ పై హ్యాకర్లు దాడి చేస్తుంటే క్రోమ్ సెక్యూరిటీ ఏమీ చేయలేకపోతోంది. 

ఇది కూడా చదవండి వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్‌పై ఏప్రిల్ 1 నుంచి కేంద్రం నిఘా! ఈ తప్పులు చేసేవాళ్లని పట్టుకోడానికే..

35

హ్యాకర్లు ఈ లోపాన్ని ఎలా ఉపయోగించారు?

"ఆపరేషన్ ఫోరమ్‌ట్రోల్" అనే ప్రచారం ద్వారా సైబర్ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఈ లోపాన్ని ఉపయోగించినట్లు కాస్పర్స్కీ చెబుతోంది. ఈ లోపం వల్ల హ్యాకర్లు క్రోమ్ బ్రౌజర్ కి చెందిన శాండ్‌బాక్స్ సెక్యూరిటీని దాటేసి వచ్చి యూజర్ల పై అటాక్ చేస్తున్నారు. శాండ్‌బాక్స్ సెక్యూరిటీ అంటే.. హానికరమైన ఫైల్స్ మొత్తం సిస్టమ్‌ను ఎఫెక్ట్ చేయకుండా ఆపడానికి డిజైన్ చేసిన ఒక సెక్యూరిటీ ఫీచర్ ఇది.

బాధితుడు లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత CVE-2025-2783 బగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసి హ్యాకర్లకు చట్టవిరుద్ధమైన యాక్సెస్ ఇచ్చింది. దీంతో హ్యాకర్ల పని ఈజీ అయిపోయింది. 

45

సైబర్ దాడి నుంచి సేఫ్‌గా ఉండటం ఎలా?

ఈ సమస్య నుంచి కాపాడుకోవడానికి క్రోమ్ యూజర్లు తమ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. విండోస్ యూజర్లు అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మిగతా క్రోమియం ఆధారిత బ్రౌజర్ల కోసం అప్‌డేట్స్ త్వరలో వస్తాయి.

సెట్టింగ్స్ లో క్రోమ్ సెలెక్ట్ చేయడం ద్వారా యూజర్లు అప్‌డేట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఏవైనా అప్‌డేట్స్ ఉంటే లేటెస్ట్ వెర్షన్ వెంటనే డౌన్‌లోడ్ అవుతుంది.

55

సెక్యూరిటీ నిపుణుల సలహాలు ఇవిగో

URLలను జాగ్రత్తగా చెక్ చేయండి. అనుమానాస్పదంగా ఉంటే క్లోజ్ చేసేయండి.

సెర్చ్ రిజల్ట్స్ పైన కనిపించే ఫ్రీ యాడ్స్‌ను క్లిక్ చేయకండి.

మీకు నమ్మకంగా ఉన్న ప్రోగ్రామ్స్, ప్లాట్‌ఫామ్స్‌, సర్వీస్ సైట్లనే ఉపయోగించండి.

కొత్త వెబ్ సైట్ ను చూసే ముందు రివ్యూస్ చదవండి.

సైబర్ దాడులు మారుతూ ఉంటాయి కాబట్టి సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం అవసరం.
 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
సాంకేతిక వార్తలు చిట్కాలు
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
మోసం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved