కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు

By narsimha lodeFirst Published Aug 5, 2019, 2:45 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ లో కేంద్రం  తీసుకొనే ఏ నిర్ణయానికైనా మద్దతును ప్రకటిస్తున్నట్టుగా టీడీపీ ప్రకటించింది. 

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి టీడీపీ మద్దతిచ్చింది. ఈ విషయంలో కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి టీడీపీ మద్దతుగా నిలిచింది.

ఆర్టికల్ 370 రద్దుపై సోమవారం నాడు టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో మాట్లాడారు.370 ఆర్టికల్ రద్దు వల్ల దేశంలోని  జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలకు మేలు కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  

 370 ఆర్టికల్ రద్దును తమ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఆర్టికల్ 370 తో కాశ్మీర్ ప్రజలకు మేలు జరగలేదని  ఆయన చెప్పారు. కాశ్మీర్ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందని ఆయన చెప్పారు.

ఉగ్రవాదం కూడ పెరిగిపోయిందని  టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్  అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

2018 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుండి  టీడీపీ బయటకు వచ్చింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో కూడ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో  టీడీపీ బీజేపీతో విభేదించింది.

సంబంధిత వార్తలు

కశ్మీర్ ను ఆక్రమించిన దేశంగా భారత్ మిగిలిపోతుంది: 370 రద్దుపై మాజీ సీఎం ముఫ్తీ ఫైర్

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

click me!