
న్యూల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా మఫ్తీ. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ఆమె ఖండించారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ ట్వీట్ చేశారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు అత్యంత చీకటి దినం అంటూ వ్యాఖ్యానించారు. 1947 నాటి సంప్రదాయాన్ని మంటగలిపారంటూ మండిపడ్డారు. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న ఆమె కశ్మీర్‌కు ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. భారత ప్రభుత్వం ఉద్దేశమేంటో ఇప్పుడు తేలిపోయింది. ప్రజలను భయపెట్టి కశ్మీర్‌ను లాక్కోవాలని చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భారత్ వైఫల్యం చెందిందంటూ దుయ్యబుట్టారు. కశ్మీర్‌ను ఆక్రమించిన దేశంగా భారత్ మిగిలిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మెహబూబా ముఫ్తీ.
ఈ వార్తలు కూడా చదవండి
కశ్మీర్ దక్షిణ సూడాన్ లా మారిపోకూడదు : ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ నేత ఆజాద్, వైగో
కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు
కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు
370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు
ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు
కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?
జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్డేట్స్