ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు రావడానికి కారణాలివే...

By SumaBala Bukka  |  First Published Nov 4, 2023, 12:05 PM IST

ఒక నెలలో మూడోసారి ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో భూ ప్రకంపనలు వణికించాయి. దేశ రాజధానిలో ఎందుకు తరచుగా ప్రకంపనలు వస్తున్నాయి? 


ఢిల్లీ : శుక్రవారం రాత్రి, నేపాల్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల నివాసితులు ప్రకంపనలతో భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో ప్రకంపనలు రావడం నెల వ్యవధిలో ఇది మూడోసారి కాగా, దేశ రాజధానిలో ఇలాంటి ఘటనలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. 

ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) సీస్మిక్ జోన్-IVలోకి వస్తాయి. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సీస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం అధిక భూకంప ప్రమాద జోన్‌గా పరిగణించబడుతుంది. జోన్ IV అనేది మోస్తరు నుండి అధిక స్థాయి తీవ్రతతో భూకంపాలు సంభవించే అవకాశాన్ని సూచిస్తుంది.

Latest Videos

ఢిల్లీ ఎందుకు జోన్-IV కిందకు వస్తుంది? తరచుగా ప్రకంపనలకు ఎందుకు గురవుతుంది?

ప్రధానంగా ఢిల్లీ భౌగోళిక స్థానం, భౌగోళిక కార్యకలాపాల కారణంగా దీన్ని జోన్-IV కిందికి వర్గీకరించారు. జాతీయ రాజధాని దాదాపు 200-300 కిలోమీటర్ల మధ్య హిమాలయ శ్రేణులకు సమీపంలో ఉంది. భారతీయ, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల నిరంతర తాకిడి కారణంగా హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ స్థిరమైన టెక్టోనిక్ కార్యకలాపం క్రమమైన ప్రకంపనలకు కారణమవుతుంది. భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలు తరచుగా జరగడానికి ఈ ప్రాంతాన్ని కేంద్రంగా మారుస్తుంది.

ప్రకంపనలు సాధారణంగా భూమి క్రస్ట్ పై పొరలో ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వలన సంభవిస్తాయి. అందువల్ల ఈ పొరలో ఎక్కువ కార్యకలాపాలు ఉంటే, భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ ప్రాంతం భూకంప ప్రమాదం ప్రధానంగా హిమాలయన్ టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దుకు సమీపంలో ఉంది, ఇక్కడే భారతీయ ప్లేట్ యురేషియన్ ప్లేట్‌తో ఢీకొంటుంది. ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాలతో సహా ఉత్తర భారతదేశంలో గణనీయమైన భూకంప కార్యకలాపాలకు ఈ తాకిడే కారణం. ఢిల్లీ ఒక పెద్ద ఫాల్ట్ లైన్‌లో లేనప్పటికీ, హిమాలయాలకు సమీపంలో ఉన్నందున ఇది భూకంప క్రియాశీల ప్రాంతంలో ఉంది.

నేపాల్ భూకంపంలో నల్గాడ్ సివిక్ బాడీ డిప్యూటీ చీఫ్ సరితా సింగ్ మృతి..

అందువల్ల, నేపాల్, ఉత్తరాఖండ్, పక్కనే ఉన్న హిమాలయ ప్రాంతం రిక్టర్ స్కేల్‌పై 8.5 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలకు గురవుతుంది. ఢిల్లీని జోన్ IVలో ఉంచడానికి హిమాలయాలకు సామీప్యత ఒక కారణం, హిమాలయ ప్రాంతం జోన్ V పరిధిలోకి వస్తుంది, దీనివల్ల భూకంపాలు ఎక్కువగా వచ్చే, ఎక్కువగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

ప్రత్యేకమైన సెటిల్మెంట్ ల వలన కూడా...

భౌగోళిక కారణాలను పక్కన పెడితే, ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ల ప్రత్యేక స్థిరనివాస నమూనాకూడా వీటికి కారణం అవుతోంది. ఈ ప్రాంతం విస్తారమైన ఎత్తైన నిర్మాణాలు, విశాలమైన అనధికారిక నివాసాల ద్వారా వర్గీకరించబడింది.  యమునా, హిండన్ నదుల ఒడ్డున ఉన్న ప్రాంతాల్లో అనేక బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. ఇక్కడే భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. పాత ఢిల్లీలోని కొని ప్రాంతాలు, నది ఒడ్డున ఉన్న అనధికార కాలనీలు కూడా కారణమవుతాయి.

భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనసాంద్రత కలిగిన పట్టణ ప్రాంతం, పురాతన మౌలిక సదుపాయాలు, దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో సరిపోని భవన ప్రమాణాలు కారణంగా ఢిల్లీలో భారీ భూకంపం పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు.

అయితే, భూకంపాలు సంక్లిష్టమైనవి. అందుకే వీటిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం అని గమనించాలి. ఒక ప్రాంతంలో భూకంప ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు, హెచ్చరికలు,సిఫార్సులను నిపుణులు చేయచ్చు, కానీ, అక్కడే, అదే సమయానికి భూకంపం వస్తుందని ఖచ్చితమైన సమయం, పరిమాణం చెప్పలేరు. 

రొటీన్ మాక్ డ్రిల్స్..

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరిన్ని విపత్తుల మాక్ డ్రిల్‌లను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) మాజీ ప్రత్యేక సీఈఓ కులదీప్ సింగ్ గంగర్ అభిప్రాయపడ్డారు.

click me!