నేపాల్ భూకంపంలో నల్గాడ్ సివిక్ బాడీ డిప్యూటీ చీఫ్ సరితా సింగ్ మృతి..

భూకంప ప్రభావం నేపాల్ తో పాటు ఖాట్మండు, చుట్టుపక్కల జిల్లాల్లో.. నేపాల్ కు దగ్గర్లో ఉన్న భారత రాజధాని న్యూఢిల్లీలో కూడా కనిపించింది.

Nalgad Civic Body Deputy Chief Sarita Singh dies in Nepal earthquake - bsb

నేపాల్ : నేపాల్ లో నిన్న రాత్రి సంభవించిన శక్తివంతమైన భూకంపంలో మరణించిన 128 మందిలో నల్‌గఢ్ పౌరసంఘం డిప్యూటీ హెడ్ కూడా ఉన్నారు. నేపాల్‌లోని మారుమూల పర్వత పట్టణమైన జాజర్‌కోట్‌లో అర్ధరాత్రి 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో అనేక ఇళ్లు కూలిపోయాయి.

జాజర్‌కోట్‌లోని నల్‌గఢ్ మున్సిపాలిటీ డిప్యూటీ హెడ్ సరితా సింగ్ భూకంపం కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ప్రభావం ఖాట్మండు, చుట్టుపక్కల జిల్లాల్లో, న్యూఢిల్లీలో కూడా కనిపించింది.

నేపాల్ లో భారీ భూకంపం, 128 మంది మృతి.. వందలాది మందికి గాయాలు...

భూకంపం సంభవించిన వెంటనే నేపాల్ సైన్యం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు శుక్రవారం అర్థరాత్రి హుటాహుటి చర్యలు చేపట్టింది.ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేపాల్ టెలివిజన్ ప్రకారం, పశ్చిమ నేపాల్‌లోని జాజర్‌కోట్, రుకుమ్ జిల్లాలు భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

నేపాల్ భౌగోళికంగా చురుకైన ప్రాంతంలో ఉంది. ఇక్కడ భారత్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొని హిమాలయాలను ఏర్పరుస్తాయి. భూకంపాలు తరచుగా సంభవిస్తాయి. 2015లో నేపాల్‌లో సంభవించిన రెండు భూకంపాలలో దాదాపు 9,000 మంది చనిపోయారు. మొత్తం పట్టణాలు, శతాబ్దాల నాటి దేవాలయాలు, ఇతర చారిత్రాత్మక ప్రదేశాలు శిథిలావస్థకు చేరుకున్నాయి,  మిలియన్ కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి, దీని వలన 6 బిలియన్ల డాలర్ల మేరకు ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios