కన్నీరు పెట్టుకున్న ఇస్రో ఛైర్మన్.. హగ్ చేసుకున్న ప్రధాని మోదీ

By telugu teamFirst Published Sep 7, 2019, 10:16 AM IST
Highlights

చంద్రయాన్ -2 ప్రయోగం చివరి దశలో ఏర్పడిన లోపంతో ఇస్రో ఛైర్మన్ శివన్ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రో ఛైర్మన్ శివన్ ను హత్తుకొని ఓదార్చారు. 

చంద్రయాన్-2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతగానే కృషి చేశారు. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో దానిని ప్రయోగించారు. మరి కొద్ది నిమిషాల్లో చంద్రయాన్ 2 చంద్రుడిపై అడుగుపెడుతుందని అనుకునేలోపు దాని నుంచి సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీంతో.. ఇస్రో శాస్త్రవేత్తలంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారి పరిస్థితి అర్థం చేసుకున్న ప్రధాని మోదీ... వారిలో మనో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.

చంద్రయాన్ -2 ప్రయోగం చివరి దశలో ఏర్పడిన లోపంతో ఇస్రో ఛైర్మన్ శివన్ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రో ఛైర్మన్ శివన్ ను హత్తుకొని ఓదార్చారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి ఘట్టంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ తెగిపోవడంతో శివన్ తో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. 

నిరాశపడిన ఇస్రో ఛైర్మన్ శివన్‌తోపాటు శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ఓదార్చి ధైర్యం చెప్పారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీ ఇస్రో ఛైర్మన్ శివన్ భుజం, వెన్ను తట్టి ధైర్యం చెప్పారు. ఈ దృశ్యాన్ని టీవీలు లైవ్ ఇవ్వడం దేశ ప్రజలందరినీ ఆకర్షించింది.
 

related news

మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను... శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ

చంద్రయాన్-2: చంద్రుడికి 2.1కి.మీ దూరంలోనే నిలిచిన విక్రమ్ ల్యాండర్, నో సిగ్నల్స్

చంద్రయాన్-2: ఆ 15 నిమిషాలే కీలకమన్న ఇస్రో ఛైర్మెన్ శివన్

చంద్రయాన్-2 గురించి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు

ఆల్‌ది బెస్ట్ ఇస్రో: కొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్

click me!