కూతురిని హత్య చేసిన ఆమె... చిదంబరాన్ని పట్టించింది..!

By telugu teamFirst Published Aug 22, 2019, 11:11 AM IST
Highlights

తన కూతురు  షీనా బోరా పేరిట భారీ మొత్తంలో సొమ్మును విదేశాల్లో దాచి పెట్టింది ఇంద్రాణి. పరిస్థితలు తనకు విరుద్ధంగా మారడంతో భారీ స్కెచ్ వేసి కూతురినే హత్య చేసింది. అంతేకాదు.. ఆమె పెళ్లి, పిల్లలు వ్యవహారం కూడా అప్పట్లో సంచలనం రేపాయి. అయితే ఇది వేర కథ. 
 

యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో చిదంబరం ఒక వెలుగు వెలిగారు. మన్మోహన్ కేబినెట్ లో కీలక బాధ్యతలు చేపట్టారు. మన దేశానికి ఆర్థిక శాఖ మంత్రి, హోం శాఖ మంత్రి పదవులు చేపట్టారు. అలాంటి చిదంబరం ఇప్పుడు కటకటాల వెనకకి వెళ్లారు. ఆయన అరెస్టు వెనుక ఉన్నది మరెవరో కాదు... ఇంద్రాణి ముఖర్జీ.. ఆమె చిదంబరం అరెస్టు అవ్వడానికి కారణం అయ్యింది. ఏమిటా కథ ఇప్పుడు చూద్దాం...

ఇంద్రాణి ముఖర్జీ... ఈమె గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కడుపున పుట్టిన కన్న కూతిరిని అతి కిరాతకంగా హత్య చేసి దేశ వ్యాప్తంగా తన పేరు మార్మోగేలా చేసుకుంది.  తన కూతురు  షీనా బోరా పేరిట భారీ మొత్తంలో సొమ్మును విదేశాల్లో దాచి పెట్టింది ఇంద్రాణి. పరిస్థితలు తనకు విరుద్ధంగా మారడంతో భారీ స్కెచ్ వేసి కూతురినే హత్య చేసింది. అంతేకాదు.. ఆమె పెళ్లి, పిల్లలు వ్యవహారం కూడా అప్పట్లో సంచలనం రేపాయి. అయితే ఇది వేర కథ. 

ఐఎన్ఎక్స్ మీడియా స్కాంలో చిదంబరం ఇరుక్కోవడానికి మాత్రం కారణం ఈమే. ఇంద్రాణి, ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీలు కూడా ఈ స్కాంలో ప్రధాన నిందితులే. అసలు ఈ మీడియా సంస్థను ప్రారంభించింది ఇంద్రాణియే. వీరు మీడియా లాబిస్టులు. ఇందులో పీటర్.. చిదంబరం కుమారుడు కార్తికి వ్యాపార సలహాదారు. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని ఇంద్రాణి ఐఎన్ఎక్స్ కేసులో 26శాతం వాటా అమ్మకానికి అనుమతి కోరారు.

కానీ ఎఫ్ఐపీబీ తొలుత ఆమె దరఖాస్తును తిరస్కరించింది. చిదంబరం కూడా రూ.4.62 కోట్ల మేర వాటా అమ్మకానికే అనుమతి ఇచ్చారు. ఆ సమయంలో కార్తి ఓ బేరం పెట్టారు. విదేశాల్లోని తన సంస్థలకు చెల్లింపుల్లో సాయపడితే ఈ డీల్ కుదరుస్తానన్నది ఆ ప్రతిపాదన. ఇందుకు పీటర్ ఒప్పుకున్నారు. మనీ లాండరింగ్ ద్వారా ఎంత మొత్తాన్ని తరలించిందన్నది ఇంద్రాణి వెల్లడించకపోయినా దాదాపు రూ.200కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి.

తర్వాత కార్తిని ఇంద్రాణి ఓ స్టార్ హోటల్లో  కలిసి 10లక్షల డాలర్ల మేర చెల్లించడానికి చర్చలు జరిపారు. చివరకు రూ.3.5కోట్ల చెల్లింపునకు ఒప్పందం కుదిరింది. ముఖర్జీ దంపతులు ఆ మొత్తాన్ని కార్తి చిందంబరానికి సింగపూర్ లో ఉన్న సంస్థ అడ్వాంటేజ్ సింగపూర్ కు బదలాయించారు. ఈ వివరాలన్నింటినీ ఇంద్రాణి సీబీఐ దర్యాప్తులో బయటపెట్టారు. ఆమె అప్రూవర్ గా మారడం వల్లే ఇప్పుడు చిదంబరం దొరికిపోయాడు. ఆ కేసు వివరాలన్నీ బయటకు వచ్చేశాయి. 

 

related news

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

చిదంబరంపై సీబీఐ ప్రశ్నల వర్షం: సమాధానం లేదన్న మాజీ హోంమంత్రి

click me!