డ్రాగన్ దూకుడు: అరుణాచల్‌ప్రదేశ్‌లో 15 ప్రాంతాలకు పేర్లు మార్చిన చైనా

By narsimha lodeFirst Published Dec 31, 2021, 10:29 AM IST
Highlights

అరుణాచల్‌లో 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. తమ భాషలో ఈ పేర్లు పెట్టడాన్ని ఇండియా తీవ్రంగా తప్పుబట్టింది. పేర్లు మార్చడం ద్వారా వాస్తవాలను చైనా మార్చలేదని ఇండియా తేల్చి చెప్పింది.

 

న్యూఢిల్లీ: South Tibet’ అని పిలుచుకొనే Arunachal Pradesh రాష్ట్రంలోని నివాస ప్రాంతాలు,పర్వతాలు,  నదులు సహా 15 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది. China  భాషలో పేర్లను పెట్టింది. చైనా ప్రభుత్వం కొత్త సరిహద్దు చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం 2022 జనవరి 1 నుండి అమల్లోకి రానుంది. ఈ చట్టం అమల్లోకి రావడానికి రెండు రోజుల ముందే ఈ 15 ప్రాంతాలకు చైనా పేర్లను మార్చింది. అయితే చైనా చర్యను India తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమ దేశంలో అంతర్భాగంగానే ఉంటుందని ఇండియా తేల్చి చెప్పింది.ఈ ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టడం ద్వారా చైనా వాస్తవాలను మార్చలేదని ఇండియా అభిప్రాయపడింది.

అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగమని చైనా వాదిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని జన్‌గ్నాస్ అని చైనీస్ పేరుతో పిలుస్తోంది.  అరుణాచల్‌ప్రదేశ్ లోని మరో 15 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్ రోమన్ అక్షరాలతో కూడిన అధికారికపేర్లు పెట్టినట్టుగా చైనా అధికారిక వార్తాసంస్థ గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.ఈ మేరకు చైనా పౌర వ్యవహరాల శాఖ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసిందని కూడా ఆ కథనం తెలిపింది. ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలున్నాయి.  ఈ నివాస ప్రాంతాలకు సెంగ్కెజాంగ్, దాగ్లుంగ్, జాంగ్, మనిగాంగ్, మడింగ్, మిగ్ పెయిన్, గోలింగ్, డంబా, మెజాగ్ అనే పేర్లను పెడుతున్నట్టుగా చైనా తెలిపింది.

also read:భారత రాఫేల్ యుద్ధ విమానాలకు సమాధానంగా పాకిస్తాన్ జే-10 సీ!.. చైనా నుంచి కొనుగోలు

నాలుగు పర్వతాలకు వామో, రి, డురి, కున్‌మింగ్ పెంగ్ అని పేర్లు పెట్టింది. రెండు నదులకు జెస్‌యోగ్మో, దులైన్ అని, పర్వత మార్గానికి సెలా అని పేరు పెట్టింది.2017లో కూడా ఇదే తరహలో చైనా అరుణాచల్ ప్రదేశ్ లో ఆరు ప్రాంతాలకు పేర్లు పెట్టింది.అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగం టిబెట్ లో భాగమని చైనా చెబుతుంది. చైనా తీరును ఇండియా తీవ్రంగా తప్పుబడుతుంది.

తన వాదనను రుజువు చేసేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లో భారత అగ్రనేతలు, అధికారుల పర్యటనలను చైనా క్రమం తప్పకుండా వ్యతిరేకిస్తోంది. భారతదేశం, చైనా సరిహద్దులో 3,488-కిమీల పొడవు గల వాస్తవ నియంత్రణ రేఖను పంచుకుంటున్నాయి. ఇది రెండింటి మధ్య వివాదంగా మారింది.90వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ చైనా చాలా ఏళ్లుగా వాదిస్తోంది.

బీజింగ్‌లోని చైనా టిబెటాలజీ రీసెర్చ్ సెంటర్‌లో నిపుణుడు లియాన్ జియాంగ్మిన్ వ్యాఖ్యలను  గ్లోబల్ టైమ్స్ ప్రస్తావించింది. ‘చైనా ప్రభుత్వం తన సార్వభౌమ హక్కులను వినియోగించుకుని దక్షిణ టిబెట్‌లోని 15 స్థలాల పేర్లను ప్రామాణికం చేయడానికి ‘చట్టబద్ధమైన చర్య’ చేపట్టింది’ అని పేర్కొంది.


 

click me!