WhatsApp Latest Feature: స్టేటస్ లవర్స్ కోసం వాట్సాప్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై స్టేటస్ టైం పెంపు..

By Rajesh Karampoori  |  First Published May 18, 2024, 1:14 PM IST

WhatsApp Latest Feature: వాట్సాప్‌లో ప్రతిరోజూ కొత్త ఫీచర్ల సమాచారం వస్తూనే ఉంటుంది. తాజాగా వాట్సాప్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇంతకీ ఆ కొత్త ఫీచర్ ఏంటీ?


WhatsApp Latest Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంటుంది. తాజాగా మరో క్రేజీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఇంతకీ ఆ కొత్త అప్టేడ్ ఏంటీ? తెలుసుకుందాం. 

వాట్సాప్ తన యూజర్లకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంలో వివిధ అప్‌డేట్‌లను తీసుకవస్తుంది. వాట్సాప్ లో ప్రొఫైల్ ఫిక్స్ ను స్క్రీన్‌షాట్స్ చేయకుండా.. నిరోధించడం, ఎవరైనా స్టేటస్ అప్‌డేట్‌లలో ఎప్పుడు ప్రస్తావించారో? యూజర్లకు తెలియజేయడం వంటి అనేక కొత్త అప్‌డేట్‌లను ప్రకటించింది. ఈ క్రమంలోనే స్టేటస్ లవర్స్ కోసం వాట్సాప్ క్రేజీ అప్‌డేట్ ను తీసుకవచ్చింది. 
ప్రస్తుత్తం వాట్సాప్ లో వినియోగదారులు గరిష్టంగా 30 సెకన్ల వీడియోలను మాత్రమే అప్‌లోడ్ చేయవచ్చు. 

Latest Videos

undefined

అందువల్ల..లాంగ్ వీడియోలను వారి స్టేటస్ అప్‌లోడ్ చేయడానికి వీలు ఉండదు. ఈ సమస్యను పరిష్కరించి, వినియోగదారులకు బెస్ట్ ఎక్స్పిరియస్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందట. 30 సెకన్ల వీడియోకు బదులు  ఒక నిమిషం వీడియోలను స్టేటస్ అప్‌డేట్‌లుగా అప్‌లోడ్ చేసేందుకు అనుమతించే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. 

వాట్సాప్ తాజా నిర్ణయంపై యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తారని నిపుణులు భావిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ కోసం కోసం సరికొత్త వాట్సాప్ బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది బీటా టెస్టర్‌లకు స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా 1 నిమిషం నిడివి ఉన్న వీడియోలను షేర్ చేసే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో వచ్చినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనీ, స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా పొడవైన వీడియోలు అప్‌డేట్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.  

 మరో సరికొత్త అప్‌డేట్స్

అలాగే వాట్సాప్ ..  క్యూఆర్ (QR)కోడ్ ద్వారా చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి కృషి చేస్తోంది. మెసేజింగ్ యాప్ మీ QR కోడ్‌ను చాట్‌ల ట్యాబ్ నుండి నేరుగా షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రస్తుతం మీరు దీన్ని చేయడానికి సెట్టింగ్‌లకు వెళ్లాలి. కొత్త అప్‌డేట్‌తో ఇది మరింత సరళంగా ఉంటుంది. దీనికి అదనంగా మీరు మీ QR కోడ్‌ను షేర్ చేసినప్పుడు WhatsAppలో మీ ఫోన్ నంబర్‌కు బదులుగా మీ వినియోగదారు పేరును ప్రదర్శిస్తుంది. అందువల్ల వాట్సాప్ యూజర్‌నేమ్ సపోర్ట్‌ను పరిచయం చేసిన తర్వాత ఈ ఫీచర్ అందుబాటులోకి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫీచర్ కూడా మరికొన్ని రోజుల్లో అమల్లోకి రానుంది.
 

click me!