Viral News: ఏం పెళ్లాంరా బాబు.. ఇంత చిన్న విషయానికి విడాకులు తీసుకోవాలా?.. కుర్కురే ఎంత పని చేసింది?

Published : May 18, 2024, 10:35 AM IST
Viral News: ఏం పెళ్లాంరా బాబు.. ఇంత చిన్న విషయానికి విడాకులు తీసుకోవాలా?.. కుర్కురే ఎంత పని చేసింది?

సారాంశం

ఇటీవల కాలంలో కొంతమంది భార్యభర్తలు చిన్నచిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. తమ వివాహా బంధాన్ని తెంచుకుంటున్నారు. తాజాగా ఓ జంట చిన్న విషయంలో గొడవపడి విడాకులు తీసుకున్నారు. ఇంతకీ  ఏం జరిగిందో తెలుసుకుందాం?

చాలామంది భార్యాభర్తలు చిన్నచిన్న విషయాలకు గొడవలుపడి విడిపోతూ ఉంటారు. అలాగే తాజాగా ఓ జంట ఓ చిన్న కుర్కురే ప్యాకెట్ కోసం దంపతులు గొడవపడ్డారు. అది కాస్త తీవ్రస్థాయికి చేరి ఏకంగా విడాకులకు దారి తీసింది. వింటుంటే చాలా సిల్లీగా ఉంది కదా. ఓ భర్త భార్యకు ప్రేమతో క్రిస్ప్స్ ప్యాకెట్ తీసుకువచ్చాడు. దీంతో గొడవకు దిగిన భార్య తన అత్తమామలను, భర్తను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్న గొడవ కాస్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ వరకు వెల్లింది. అక్కడ ఉన్న పెద్దవారు ఆ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇంతకీ ఈ ఫన్నీ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆగ్రాలో గల షాగంజ్‌లో జరిగింది. ఓ భర్త తనకు నచ్చిన 5 రూపాయల కుర్కురే చిప్స్ తీసుకురాకపోవడంతో భర్తతో గొడవడింది. అంతటితో ఆగక భర్త, అత్తమామను వదిలేసి వెళ్లి పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. ఆ గొడవకాస్త ఇప్పుడు విడాకులకు దారితీసింది. ప్రస్తుతం ఆ మహిళ ఒకటిన్నర నెలలుగా పుట్టింటిలోనే ఉంటుంది. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ కేసును ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెల్‌కు బదిలీ చేశారు. ఆ తరువాత అధికారులు దంపతులను సెల్‌కి పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఈ దంపతులకు  కౌన్సెలింగ్ ఇచ్చిన డాక్టర్ సతీష్ ఖీర్వారా మాట్లాడారు. గతేడాది 2023లో వీరి వివాహం జరిగిందని తెలిపారు. కేవలం ఒక ఏడాదిలోనే చిన్న చిన్న గొడవలకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని తెలిపారు. కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో తన భర్త తనను కొట్టాడని చెప్పగా ఎందుకని ఆరా తీశారు. వారిద్దరికీ  5 రూపాయల కుర్కురే విషయంలో గొడవ వచ్చిందని, కుర్కురే కొనివ్వనందుకు గొడవ పడిందని తెలిపారు. దానికోసమే తాను అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త తెలిపారు. ప్రస్తుతం ఈ వింత కేసు దంపతుల విడాకులు వాయిదా పడ్డాయి.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌