రిటైర్మెంట్ తర్వాత బిజెపిలోకి ధోనీ: జార్ఖండ్ ఎన్నికల్లో తురుపుముక్క

By telugu teamFirst Published Jul 7, 2019, 11:07 AM IST
Highlights

ఒక వేళ ధోనీ తమ పార్టీలో చేరడానికి ఇష్టపడకపోతే కనీసం ప్రచారానికైనా వాడుకునే విధంగా చూడాలని బిజెపి నాయకత్వం ఆలోచిస్తోంది. జార్ఖండ్ శానససభ ఎన్నికలు డిసెంబర్ లో జరగనున్నాయి. 

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై బిజెపి కన్నేసింది. జార్ఖండ్ ఎన్నికల్లో ధోనీ పాపులారిటీ పార్టీకి ఉపయోగపడుతుందని బిజెపి నాయకత్వం భావిస్తోంది. జెఎంఎం, ఆర్జెడి, కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి జార్ఖండ్ లో ధోనీ ప్రజాదరణను వాడుకోవాలని బిజెపి భావిస్తోంది. 

ఒక వేళ ధోనీ తమ పార్టీలో చేరడానికి ఇష్టపడకపోతే కనీసం ప్రచారానికైనా వాడుకునే విధంగా చూడాలని బిజెపి నాయకత్వం ఆలోచిస్తోంది. జార్ఖండ్ శానససభ ఎన్నికలు డిసెంబర్ లో జరగనున్నాయి. 

బిజెపి నాయకులు పలువురు ధోనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్ టోర్నమెంటు తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నందున ఇప్పటి నుంచే బిజెపి నేతలు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. 

అయితే, ధోనీ తన రిటైర్మెంటు గురించి స్పష్టంగా ఏమీ చెప్పలేదు. తాను ఎప్పుడు రిటైర్ అవుతానో తనకు తెలియదని అన్నాడు. ధోనీ రిటైర్మెంటు తమకు ఉపయోగపడుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు.

రిటైర్మెంటు తర్వాత రాజకీయాల్లోకి రావడానికి ధోనీ ఆసక్తి చూపుతున్నట్లు బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే, పార్టీలో చేరుతారా, లేదా అనేది ఆయనకే వదిలేస్తామని కూడా అంటున్నారు.

సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా నిరుడు ఆగస్టు 5వ తేదీన బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు పియూష్ గోయల్, సరోజ్ పాండే , మనోజ్ తివారీ ధోనీ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. 

click me!