Icc World Cup 2019  

(Search results - 567)
 • sachin

  World Cup18, Jul 2019, 4:02 PM IST

  కప్ పోయిందన్న బాధ ముఖంపై లేదు: విలియమ్సన్‌పై సచిన్ ప్రశంస

  న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్‌పై ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రసంశల వర్షం కురిపించాడు. ప్రపంచకప్ పోయిందన్న బాధ అతని ముఖంపై లేదని టెండూల్కర్ ప్రశంసించాడు.

 • rohit sharma

  Specials18, Jul 2019, 2:54 PM IST

  ఐసిసి స్పెషల్... మరో అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ

  ఇంగ్లాండ్ వేదికన జరిగిన ఐసిసి ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న  విషయం తెలిసిందే. ఇలా ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులతో గోల్డెన్ బ్యాట్ అందుకున్న అతడిపై మరోసారి ఐసిసి ప్రశంసలు కురిపించింది. 

 • guptil

  CRICKET17, Jul 2019, 8:59 AM IST

  ఎట్టకేలకు ఆ ఓవర్‌ త్రో గురించి నోరువిప్పిన ఐసీసీ

  ప్రపంచకప్ ఫైనల్ ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా దాని గురించే మాట్లాడుకోవడం బహుశా ఈ ఏడాది వరల్డ్‌కప్‌కే చెల్లుతుందనుకుంటా.. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ ఫైనల్ ఓవర్‌లో గప్టిల్ ఓవర్‌త్రో పై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది

 • অমিতাভ বচ্চন- এক সময়ে তাঁর অমিতাভ বচ্চন করপোরেশন লিমিটেড পুরোপুরি দেউলিয়া হয়ে যায়। সে সময়ে কওন বনেগা ক্রোড়পতি তাঁর ভাগ্য ফেরায়।

  Specials16, Jul 2019, 9:26 PM IST

  వరల్డ్ కప్ వివాదం: రూ.2000ల ఉదాహరణ.... ఐసిసిపై అమితాబ్ సెటైర్లు

  ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ విజేతలను నిర్ణయించడానికి ఐసిసి ఉపయోగించి బౌండరీ నిబంధనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఐసిసి నిబంధనలపై సెటైర్లు విసిరారు. 

 • stokes

  Specials16, Jul 2019, 5:59 PM IST

  తండ్రిగా మాత్రమే గెలిచా...కానీ ఓ పౌరుడిగా మాత్రం ఓడిపోయా: స్టోక్స్ తండ్రి

  స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. క్రికెట్ కు పుట్టినిల్లయిన ఆ దేశానికి ఇన్నేళ్లు వరల్డ్ కప్ ట్రోఫీ అనేది అందని ద్రాక్షలా మిగిలిపోయింది. కానీ తాజాగా ఆ జట్టు లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడగలిగింది. ఇలా ఈ మెగా టోర్నీలో ఆతిథ్య జట్టును విజేతగా నిలబెట్టిన ఘనత బెన్ స్టోక్స్ కు దక్కుతుంది. ఫైనల్లో అతడు ఓ వైపు సహచరులు వరుసగా వికెట్లు కోల్పోతున్నా సమయోచితంగా బ్యాటింగ్ చేసి 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయం వైపు నడిపించాడు.

 • SPORTS16, Jul 2019, 2:39 PM IST

  సచిన్ వరల్డ్ కప్ జట్టు.. ధోనికి దక్కని చోటు

  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన వరల్డ్ కప్ జట్టును ప్రకటించారు. క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమ క్రికెట్ జట్టును సీనియర్ క్రికెటర్లు ప్రకటించడం మనకు తెలిసిన విషయమే. 

 • ఇక పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ గుర్తింపు సాధించాడు. గతంలో పాక్‌పై విరాట్‌ కోహ్లి వరల్డ్‌కప్‌ సెంచరీ సాధించాడు. 2015లో కోహ్లి ఈ ఘనత సాధించగా, ఇప్పుడు కోహ్లి సరసన రోహిత్‌ చేరాడు.

  Specials16, Jul 2019, 2:18 PM IST

  టార్గెట్ 2023 వరల్డ్ కప్... టీమిండియా కెప్టెన్ గా రోహిత్...?

   2019 ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగా ఆడినా విజయం సాధించలేకపోయింది. దీంతో 2023 వరల్డ్ కప్ లక్ష్యంగా భారత జట్టును తీర్చిదిద్దాలని బిసిసిఐ భావిస్తోందట. అందుకోసం జట్టులో భారీ మార్పులు చేపట్టాలని...ముఖ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుండి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మ ను నియమించాలని చూస్తోందట. కేవలం వన్డే జట్టుకు మాత్రమే రోహిత్ ను సారథిగా ఎంపికచేసి టెస్టులకు మాత్రం కోహ్లీనే కొనసాగించాలని చూస్తున్నట్లు ఓ బిసిసిఐ అధికారి తెలిపారు.  

 • gary stead

  Specials16, Jul 2019, 12:49 PM IST

  మమ్మల్ని ఓడించింది ఇంగ్లాండ్ కాదు...ఐసిసి: కివీస్ కోచ్ గ్యారీస్టెడ్‌

  ప్రపంచ కప్ విజేతగా నిలవడం ద్వారా ఇంగ్లాండ్ జట్టు చిరకాల కోరిక నెరవేరింది. ఇదే క్రమంలో వరుసగా రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరినప్పటికి  న్యూజిలాండ్ ఆశలపై ఐసిసి నిబంధనలపై నీళ్లు చల్లాయి.  ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే ఐసిసి నిబంధనల వల్ల అదృష్టం కలిసివచ్చి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ ను జయించింది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఇలాంటి టోర్నీలో ఐసిసి అనుసరించిన నిబంధనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 • guptil

  World Cup16, Jul 2019, 11:02 AM IST

  అంపైర్లే కివీస్‌ను ముంచారు: ఓవర్‌త్రో వివాదంపై మాజీ అంపెర్లు

  నరాల తేగే ఉత్కంఠ మధ్య జరిగిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే కివీస్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇంగ్లాండ్‌ది అసలు గెలుపుకాదని.. అంపైర్లు నిబంధలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ కామెంట్ చేస్తున్నారు. 

 • Shane Warne

  Specials15, Jul 2019, 8:57 PM IST

  ప్రపంచ కప్ ఫైనల్... సూపర్ ఓవర్ కూడా టై అవగానే ఇలా చేయాల్సింది: షేన్ వార్న్

  ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతలను తేల్చడంతో ఐసిసి విఫలమైందని ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.  అసలు సూపర్ ఓవర్ పేరుతో కేవలం ఆరు బంతుల్లోనే జట్ల బలాబలాలను ఎలా తేలుస్తారని కొందరు తప్పుబడుతుంటే బౌండరీల ద్వారా విజేతను నిర్ణయించడం అనేది మరింత వివాదాస్పదమయ్యింది. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ కూడా దీన్ని తప్పుబట్టారు. 

 • icc

  Specials15, Jul 2019, 7:11 PM IST

  ఐసిసి ప్రపంచ కప్ టీం...కోహ్లీకి దక్కని అవకాశం వారిద్దరికి దక్కింది

  స్వదేశంలో జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తన చిరకాల వాంఛను పూర్తిచేసుకుంది. నిన్న(ఆదివారం) లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఇంగ్లాండ్ ను మొదటిసారి విశ్వవిజేతగా నిలబెట్టింది. వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరినప్పటికి న్యూజిలాండ్ ప్రపంచ కప్ ట్రోఫీ మరోసారి మిస్సయ్యింది. ఇలా ఐసిసి ప్రపంచ కప్ మెగా టోర్నీ విజవంతంగా ముగిసిన విషయం తెలిసిందే.  అయితే ఈ టోర్నీలో అత్యుత్తమంగా ఆడిన ఆటగాళ్లందరిని కలిపి ఐసిసి తాజాగా  ఓ క్రికెట్ జట్టును రూపొందించింది. ఈ జట్టులో టీమిండియా నుండి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. 

 • Jimmy Neesham

  Specials15, Jul 2019, 2:44 PM IST

  క్రికెట్ కంటే అదే నయం... ప్రపంచ కప్ ఓటమిపై జిమ్మీ నీషమ్ తీవ్ర అసహనం

  స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తమ చిరకాల వాంఛను నెరవేర్చుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఫైనల్ పోరులో కివీస్ చివరి వరకు శక్తివంచన  లేకుండా పోరాడినా అదృష్టం కలిసిరాక ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన ఆ జట్టు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

 • Team India

  World Cup15, Jul 2019, 1:44 PM IST

  ఆ విషయంలో న్యూజిలాండ్‌ కన్నా భారతే నయిం

  44 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది.  వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్ అనూహ్య పరిణామాల మధ్య కప్ పొందలేకపోయింది

 • dhoni

  World Cup15, Jul 2019, 12:20 PM IST

  ఫైనల్‌లో గప్టిల్ రనౌట్: ధోనిని ఔట్ చేసిన కర్మ ఫలమేనా.. ఫ్యాన్స్ ట్రోలింగ్

  రన్‌ కోసం ప్రయత్నించిన ధోని... గప్టిల్ వేసిన అద్భుతమైన త్రోకు రనౌట్ అవ్వడంతో 130 కోట్ల మంది భారతీయుల కల చెదిరిపోయింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ గప్టిల్‌ను విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.