మ‌త ప్రాతిప‌దిక‌ రిజ‌ర్వేష‌న్లపై కాంగ్రెస్‌కు ప్రధాని మోడీ స‌వాల్ 

By Rajesh Karampoori  |  First Published May 1, 2024, 9:16 PM IST

Loksabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ కు ప్రధాని నరేంద్ర మోడీ సవాల్ విసిరారు.  కాంగ్రెస్‌కు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోమని రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


Loksabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు వర్షం కురిపిస్తున్నాయి. అయితే.. ఈ తరుణంలో ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. అదే ముస్లీంల రిజర్వేషన్. ముస్లిం కమ్యూనిటీకి రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రకటించడంపై బీజేపీ మండిపడుతోంది. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడుతున్నారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లోని బనస్కాంతలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోమని రాతపూర్వకంగా ఇవ్వాలని సవాల్ విసిరారు. మీకు ధైర్యం ఉంటే.. బీజేపీ (టీ అమ్మేవారి)తో పోరాడండని ప్రధాని సవాల్ విసిరారు. ఇండియా కూటమికి ప్రధాని మోడీ సవాల్‌ విరుతూ.. దేశానికి హామీ ఇవ్వండి.. రాతపూర్వకంగా హామీ ఇవ్వండి. ఎందుకంటే వారిని మనం నమ్మలేం. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోమని ప్రకటించాలని సవాల్ విసిరారు.  SC, ST , OBC, జనరల్ కేటగిరీ రిజర్వేషన్‌లను ఎప్పటికీ తాకబోమని ప్రకటించాలని అన్నారు.  

Latest Videos

కాంగ్రెస్, ఇండియా కూటమి అబద్ధాలతో మరోసారి రంగంలోకి దిగాయనీ, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామనీ, రిజర్వేషన్లు తీసేస్తామని అబద్ద ప్రచారం చేస్తుందని ప్రధాని మోడీ మండిపడ్డారు. 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన పార్టీ ప్రజలకు చేరువ కావడానికి అసత్య ప్రచారం చేస్తుందనీ,  అబద్దాల ప్రేమ దుకాణం ఫేక్ ఫ్యాక్టరీ ప్రారంభించిందని అన్నారు. 


 400 సీట్ల గురించి మాట్లాడుతున్న‌వారు త‌మ‌కు పార్ల‌మెంట్‌లో ఇప్ప‌టికే 360 స్ధానాలు ఉన్నాయ‌న్న విష‌యం మ‌రువ‌రాద‌నీ,  బీజేడీ, వైసీపీ వంటి పార్టీలు త‌మ కూట‌మిలో లేకున్నా త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తాయని అన్నారు. వీట‌న్నింటిని క‌లుపుకుంటే.. త‌మ‌కు పార్ల‌మెంట్‌లో 400 స్ధానాల బ‌ల‌మున్నా తాము రిజ‌ర్వేష‌న్ల‌ను తొల‌గించే పాపానికి పాల్ప‌డ‌లేద‌ని గుర్తుచేశారు. 2014కు ముందు కాంగ్రెస్ హ యాంలో ఉగ్రదాడులు, స్కామ్‌లు, అవినీతి గురించి దేశ‌వ్యాప్తంగా క‌థ‌నాలు వ‌చ్చేవ‌ని ప్రధాని మోడీ అన్నారు.

click me!