గాలితో పరిచయం...ఇరుక్కున్న 4 నగరాల బంగారు వ్యాపారులు

By sivanagaprasad kodatiFirst Published Nov 10, 2018, 10:13 AM IST
Highlights

మైనింగ్ కింగ్, బళ్లారి రారాజు గాలి జనార్థన్ రెడ్డి ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోవడంతో ఆయన కోసం కర్ణాటక పోలీసులు, సీబీఐ వేట సాగిస్తున్నాయి. ఆయన అసలు ఇండియాలో ఉన్నారా.. లేదంటే దేశం విడిచి పారిపోయారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మైనింగ్ కింగ్, బళ్లారి రారాజు గాలి జనార్థన్ రెడ్డి ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోవడంతో ఆయన కోసం కర్ణాటక పోలీసులు, సీబీఐ వేట సాగిస్తున్నాయి. ఆయన అసలు ఇండియాలో ఉన్నారా.. లేదంటే దేశం విడిచి పారిపోయారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ నేపథ్యంలో బళ్లారిలోని గాలి నివాసంతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించి.. తనిఖీలు జరిపారు. గాలికి బంగారు వ్యాపార లావాదేవీల్లో సహకరించిన బళ్లారి నగరంలోని రాజ్‌కమల్ యజమానిని పోలీసులు విచారించారు.

గాలి బంగారం ఎప్పుడు కొన్నా ఇతని వద్ద నుంచే కొనేవారు.. అలాగే దేశంలోనే అత్యంత వైభవంగా నిర్వహించిన కుమార్తె వివాహానికి ఇక్కడి నుంచే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

దీనితో పాటు ఇంత వరకు గాలి జనార్థన్ రెడ్డి ఎంత బంగారం కొన్నది.. ఎక్కడెక్కడ కొన్నది.. అందులో వజ్రాలు, ఇతర బంగారు బిస్కెట్లు ఎన్ని.. దీంతో పాటు గాలికి బళ్లారితో పాటు బెంగళూరు, హైదరాబాద్, ముంబయి నగరాల్లో ఏయే బంగారు వ్యాపారులతో సంబంధాలు, పరిచయాలు ఉన్నాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

సీబీఐ ఆయనను తొలిసారి అరెస్ట్ చేయడానికి ముందు ఎక్కడెక్కడ బంగారు ఆభరణాల వ్యాపారులతో సంబంధాలు కొనసాగించింది పోలీసులు విచారిస్తున్నారు. దీంతో జనార్థన్ రెడ్డితో పరిచయం ఉన్న పాపానికి ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆభరణాల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతిపరుడికి దగ్గరగా ఉన్నందుకు తమకు కష్టాలు తప్పడం లేదని లబోదిబోమంటున్నారు.

 

పోలీసులకు లొంగిపోనున్న గాలి..?

హైదరాబాదులోని ఫ్రెండ్ ఇంట్లో గాలి: తృటిలో గాయబ్

ఇంట్లో సోదాలు: అధికారులతో గొడవకు దిగిన గాలి అత్త

పరారీలో గాలి జనార్దన్ రెడ్డి: బయటపడిన షాకింగ్ విషయాలు

పోలీసు వేట: గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నారా...

పరారీలో గాలి జనార్థన్ రెడ్డి...ఎమ్మెల్యే శ్రీరాములు ఏమన్నారంటే

అంబిడెంట్ కంపెనీతో డీల్: పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి

కాంగ్రెస్ 14 ఏళ్ల నిరీక్షణ... ‘‘గాలి’’ కోటలో హస్తం పాగా

గాలి వివాదం: ఏపీ, కర్నాటకలకు సుప్రీం వార్నింగ్
 

click me!