సర్వే: అందుకే రెండోసారి అధికారంలోకి బీజేపీ

By narsimha lodeFirst Published Jun 5, 2019, 5:44 PM IST
Highlights

ధనవంతులు, అగ్రవర్ణాలు, ఎగువ మధ్యతరగతి ప్రజలు మొగ్గు చూపడం వల్లే బీజేపీ మరోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిందని నేషనల్ ఎలక్షన్ స్టడీ 2019 సర్వే తేల్చి చెప్పింది.
 

న్యూఢిల్లీ:  ధనవంతులు, అగ్రవర్ణాలు, ఎగువ మధ్యతరగతి ప్రజలు మొగ్గు చూపడం వల్లే బీజేపీ మరోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిందని నేషనల్ ఎలక్షన్ స్టడీ 2019 సర్వే తేల్చి చెప్పింది.

అగ్రవర్ణాల్లో 61 శాతం మంది బీజేపీకే ఓటు వేశారని ఈ సర్వే తేల్చి చెప్పింది. మోడీ కేబినెట్‌లో సగానికి పైగా అగ్రవర్ణాలకు ఎక్కువ మందికి చోటు దక్కింది. ఆ తర్వాత 44 శాతం మంది ధనవంతులు, అంతే శాతం ఎగువ మధ్యతరగతి ప్రజలు బీజేపీకి ఓటు చేశారని ఈ సర్వే అభిప్రాయపడింది. దిగువ తరగతి ప్రజలు, పేదల్లో 36 శాతం ఓటర్లు బీజేపీకి ఓటేశారు.ఎన్నికల కమిషన్ డేటా ప్రకారంగా 41.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 32.9 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 37.6 శాతం ప్రజలు బీజేపీకి ఓటేశారు. ఎ

న్నికల ప్రచారానికి బీజేపీ ఎక్కువ ఖర్చు చేయడం కూడ ఆ పార్టీకి కలిసి వచ్చిందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం 60వేల కోట్లు ఖర్చు చేశాయని ది సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ అంచనా వేసింది. ఇందులో రూ. 27 వేలను బీజేపీ ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీ 15 నుండి 20 శాతం మాత్రమే ఖర్చు చేసినట్టుగా ఈ సర్వే తేల్చి చెప్పింది.

click me!