Indelible Ink: ఓటరుకు రెండు చేతులు లేకపోతే.. సిరా గుర్తు ఎక్కడ వేస్తారో తెలుసా?

By Rajesh Karampoori  |  First Published May 7, 2024, 6:53 PM IST

Indelible Ink: ఎన్నికల సమయంలో మనం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు వేలిపై ప్రత్యేక రకమైన సిరా వేస్తారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటు వేసే ముందు ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా వేస్తారు. అయితే ఓటరుకు వేలు లేకపోతే సిరా ఎక్కడ వేస్తారో తెలుసా?  


Indelible Ink: దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. నేటితో మూడో దశ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక తెలుగు రాష్ట్రాలలో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 13న జరిగే నాలుగో దశ ఎన్నికల పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఒక్కరి పై ఒక్కరూ విమర్శ ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని అటు అధికార పార్టీలు, ఇటు ప్రతిపక్ష పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ తరుణంలో భారీ ఎత్తున ప్రచారంలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మే 11న ప్రచార పర్వానికి తెరపడనుంది. ఇక ఇప్పటికి ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 80 సంవత్సరాలు దాటి వృద్ధులకు ఇంటి నుండే ఓటు వేసే సౌకర్యాన్ని ఈసీ కల్పించింది. 

Latest Videos

undefined

ఇదిలా ఉంటే.. ఎన్నికలు అనగానే మాకు గుర్తొచ్చేది ఎన్నికల సిరా గుర్తు. చాలామంది యువత ఎన్నికలలో ఓటేసిన తర్వాత తమ చేతికి వేసిన సిరా గుర్తును చూపించుకుంటూ సెల్ఫీలు దిగుతుంటారు. వాటిని తమ సోషల్ మీడియా అకౌంట్లో వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక రకంగా తమ బాధ్యతను గుర్తుచేస్తుంది. వాస్తవానికి ఈ సిరా గుర్తును ఎన్నికల సమయంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు అని తెలపడానికి సిరా గుర్తును ఎడమ చేతి చూపుడు వేలుకు పెడతారు. అయితే ఈ విషయం అందరికీ తెలిసింది. 

ఓటర్ కు చేయికి వేళ్లు లేకపోతే..

అయితే ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే కుడి చేతి చూపుడు వేలుకు ఎన్నికల గుర్తు పెడుతూ ఉంటారు. అసలు రెండు చేతులు లేకపోతే ఏం చేస్తారో తెలుసా. ? వారికి సిరా గుర్తును ఎక్కడ పెడతారో తెలుసా? అనే అంశాలపై ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. ఈసీ ప్రకారం ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో ఎడమ చేతి చూపుడువేలుకు  సిరా గుర్తును పెడుతుంటారు. అయితే ఎడమచేతి చూపుడువేలు లేకపోతే మధ్య వేలికి అది కూడా లేకపోతే బొటనవేలికి పెడుతుంటారు. అసలే ఎడమ చేయి లేకపోతే కుడి చెయ్యి చూపుడువేలకి, ఆ వేలు కూడా లేకపోతే.. మధ్య వేలికి, లేదా ఉంగరం వేలుకి సిరా గుర్తు పెడుతుంటారు. ఒకవేళ ఓటరు కు రెండు చేతులు లేకపోతే కాలు వేలికి సిరా గుర్తును పెడతారు ఈ మేరకు ఎన్నికల సంఘం ఎన్నికల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. 

కాగా తెలంగాణ, ఏపీ లలో పార్లమెంటు ఎన్నిక పోలింగ్ 13న జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో అధికారం కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి, బీఆర్ఎస్ మద్య పోటీ నెలకొంది. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార వైసిపికి, ప్రతిపక్ష కూటమి అయినా టిడిపి జనసేన బిజెపిలు ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు.
 

click me!