నిద్రకూడా మనుషుల్ని స్వార్థపరులుగా మారుస్తుందా..?

By Mahesh RajamoniFirst Published Aug 26, 2022, 9:53 AM IST
Highlights

ఒక కొత్త పరిశోధన ప్రకారం.. ఒక వ్యక్తికి తగినంత నిద్రలేకపోవడం వల్ల కూడా ఇతరులకు సాయం చేయాలన్న కోరికలు, దయ, జాలి గుణాలు తగ్గుతాయట. ఒకరకంగా చెప్పాలంటే తగినంత నిద్రలేకపోవడం వల్ల మనుషులు స్వార్థపరులుగా మారుతారట. 
 

మన శరీరానికి నిద్ర చాలా అవసరం. నిద్రతోనే శారీరక ఆరోగ్యంతో పాటుగా.. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒకవేళ సరైన నిద్రలేకపోతే ఎన్నో రకాల రోగాలకు దారితీస్తుంది. 

ఒక కొత్త పరిశోధన ప్రకారం.. నిద్రలేని రాత్రుల వల్ల మనుషులు స్వార్థపూరితంగా ప్రవరిస్తారు. పి. ఎల్. ఒ.ఎస్ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. ఒక వ్యక్తికి తగినంత నిద్రలేకపోవడం వల్ల ఇతరులకు సాయం చేయాలన్న ధోరణి తగ్గుతుంది. అంటే నిద్ర సహాయం చేయాలనే ధోరణీని ప్రభావితం చేస్తుందన్న మాట. 

బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో.. ఒక గంట నిద్రను కోల్పోవడం వల్ల ఒకరికి సహాయం చేసే వ్యక్తుల ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని వెల్లడైంది. 

‘ఒక గంట నిద్రపోవడం వల్ల మరొకరి సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది. అంటే ఒక గంట నిద్ర కూడా మరొకరికి సహాయపడాలనే  ధోరణీని ప్రభావితం చేయడానికి సరిపోతుంది" అని సెంటర్ ఫర్ హ్యూమన్ స్లీప్ సైన్స్‌లో పోస్ట్‌ డాక్టోరల్ ఫెలో ఆఫ్ సైకాలజీ బెన్ సైమన్ అన్నారు.

ఒక వ్యక్తి ఒక గంట పాటు నిద్రను కోల్పోతే.. అతనికున్న దయ తెబ్బతింటుంది. ఒక రకంగా చెప్పాలంటే రోజూ ఒక గంట పాటు నిద్రను కోల్పోతే.. ఆ వ్యక్తికున్న దయ, జాలి వంటివి తగ్గుతాయనిన సైమన్ అన్నారు. 

అయితే ఇతరులకు సాయం చేయాలనే ప్రవర్తన కలిగి ఉన్న వారికి నిద్ర నష్టం వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవడానికి మూడు వేర్వేరు అధ్యయనాలు నిర్వహించారు. నిద్ర గంటలు, నిద్ర నాణ్యత.. అనే రెండూ వ్యక్తి భావోద్వేగాలను, సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. 

 నిద్ర గంటలు కొంత మొత్తంలో పెరిగితే.. ఇతరులకు సహాయం చేయాలనే కోరిక పెరుగుతుందని అని బెన్ సైమన్ వివరించారు. మొత్తంగా నిద్రలేకపోవడం వల్ల స్వార్థపూరితంగా మారతారన్న మాట. అందుకే  ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా టైంను సెట్ చేసుకోండి. 

నిద్రలేమి వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్య సమస్యలతో పాటుగా ఊబకాయం వంటి శారీరక సమస్యలు కూడా వస్తాయని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 

click me!