Breast cancer: రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఏ వయసు వారికి వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి?

By Mahesh RajamoniFirst Published Jan 22, 2022, 3:51 PM IST
Highlights

Breast cancer: ప్రస్తుతం చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ యువతుల కంటే 40 దాటిని ఆడవారికే ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే ఈ సమస్య నుంచి వీలైనంత తొందరగా బయటపడొచ్చు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..
 

Breast cancer: వయసు మీద పడుతున్న కొద్ది మహిళలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. అందులో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. యువతుల కంటే వయసు మీద పడుతున్న ఆడవారిలోనే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సోకే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు వెళ్లడిస్తున్నారు. అందులోనూ ప్రతి ఏడాది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన 80 శాతం మహిళల్లో ఎక్కువగా 45 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారేనని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. అలాగే ఈ జాబితాలో 65 ఏండ్లు అంతకంటే ఎక్కువ ఏండ్లున్న వారు 43 శాతం ఉన్నట్టుగా తేలింది. ముఖ్యంగా 40 -50 మధ్య వయసున్న వారిలో ప్రతి 69 మంది ఆడవారిలో ఒకరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని నిపుణులు వెళ్లడిస్తున్నారు. వీరితో పాటుగా 50-60 ఏండ్ల వారిలో, 43 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ కు బారిన పడుతున్నారు. అందుకే దీని బారిన పడకుండా ఉండాలన్నా.. మొదట్లోనే రొమ్ము క్యాన్సర్ ను గుర్తించాలన్నా 40 ఏండ్లు దాటిన తర్వాత ఖచ్చితంగా టెస్ట్ లు చేయించుకోవాలి. కాగా ప్రతి మహిళ పీరియడ్స్ అయిన తర్వాత ప్రతినెల రెండు సార్లు తమ వక్షోజాలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం.

లక్షణాలు:  ఎప్పటికప్పుడు వక్షోజాలపై ఎక్కడైనా స్కిన్ కలర్ మారిందా లేదా అనేది చూస్తూ ఉండాలి. అలాగే చనుమొనల నుంచి రక్తం వస్తే అది క్యాన్సర్ లక్షణమని గుర్తించాలి. ముఖ్యంగా వక్షోజాలలో గడ్డలు లేదా కణుతులు వంటివి ఏర్పాడ్డాయా? లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే వక్షోజాలు పాలిపోయిన నారింజ రంగులోకి మారితే కూడా అది బ్రెస్ట్ క్యాన్సరేనని గుర్తించాలి. వీటితో పాటుగా వక్షోజం ఒక వైపు నుంచి మరోవైపుకు కదులుతుంటే కూడా అనుమానించాల్సిందే. వక్షోజాలల్లో గడ్డలు ఉన్నట్టు అనిపిస్తే దానిపై ఉండే చర్మం కదులుతుందా? లేదా అని చెక్ చేయాలి. ముఖ్యంగా మెడ, గొంతు లేదా చంకల్లో గడ్డలు లేదా కణుతులు ఉన్నట్టు అనిపించినా అది బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణమే. పై లక్షణాలలో ఒక్కటి ఉన్నట్టు అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. ముందస్తుగా గుర్తిస్తే ఈ క్యాన్సర్ నుంచి పూర్తిగా బయపడినవారవుతారు. 

రొమ్ము క్యాన్సర్ కు చికిత్స విధానాలు చాలానే ఉన్నాయి. కాగా రోగి యోక్క క్యాన్సర్ దశను బట్టే చికిత్స విధానం మారుతుంది. కాగా ఈ క్యాన్సర్ ను కీమోథెరపీ, శస్త్రచికిత్స, హార్మోన్ ల థెరపీ ల ద్వారా నయం చేస్తారు. ఈ సమస్య నుంచి తొందరగా బయటపడాలంటే ఖచ్చితంగా 40 ఏండ్లు దాటిని వారు 6 నెలలకొకసారి క్యాన్సర్ టెస్టులు చేయించుకోవాలి. అలాగే వారి జీవన శైలి బాగుండాలి. ప్రతి రోజూ వ్యాయామం, పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ అలవాట్లు క్యాన్సర్ నుంచి తొందరగా కోలుకునేలా చేస్తాయి. 
 

click me!