ముఖానికి వీటిని వాడితే మీ పని అంతే ..! అవేంటో తెలుసా..?

By Mahesh RajamoniFirst Published Jan 11, 2022, 11:08 AM IST
Highlights

అందంగా కనిపించడం కోసం ఎంతటి సాహసమైనా చేస్తుంటారు అమ్మాయిలు. ముఖ్యంగా ముఖం అందంగా, దగదగ మెరిసిపోవాలని మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను, ప్రొడక్ట్స్ లను వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల ఎంత అందంగా కనిపించామనే సంగతి పక్కన పెడితే.. ఎంత ప్రమాదంలో పడుతున్నామన్నదే అసలు సమస్య. మనం వాడే ప్రొడక్ట్స్ ముఖానికి మేలు చేసేవా.. కీడు చేసేవా అని ఆలోచించకుండా ఫేస్ కు అప్లై చేయడం చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకాల ప్రొడక్ట్స్ ముఖానికి అస్సలు మంచివి కావు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Health Tips For Face: పార్టీలకు వెళ్లినా,  పెళ్లిళ్లకు వెళ్లినా.. మనం ఎంత అందంగా ఉన్నమనే విషయాన్ని మన ఫేసే చెబుతుంది. మన ముఖ సౌందర్యమే మనమెంత హుషారుగా, అందంగా మెరిసిపోతున్నామో చెబుతుంది. దాని తర్వాతే మన డ్రెస్సింగ్ సెన్స్ మనల్ని అందట్లో అందంగా నిలబెడుతుంది. అందుకే అమ్మాయిలు ముఖ సౌందర్యానికే ఎక్కువ Preference ఇస్తుంటారు.  అందుకే అందంగా, అద్భుతంగా కనిపించడం కోసమని ఎంతో మంది యువతులు మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను, లోషన్స్ లను,  Beauty Product లను విచ్చల విడిగా వాడుతుంటారు. అందులోనూ అవి మన ముఖానికి మంచి చేసేవా.. లేకపోతే చెడు చేసేవా అని ఆలోచించకుండా వాడటం అలవాటైపోయింది. ఆ తర్వాత నానా తంటాలు పడుతుంటారు. వీటితో పాటుగా ముఖ సౌందర్యం కోసమని ఇంటి చిట్కాలను కూడా పాటిస్తుంటారు. అంతా బానే ఉన్నా.. మనం ఉపయోగించే చిట్కాలు, ప్రొడక్ట్ లు ముఖానికి పెట్టదగినవేనా అనేది ఒక సారి ఆలోచించాలి. ఎందుకంటే ముఖానికి కొన్నింటిని పెట్టడం వల్ల Face దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖానికి ఏవి వాడాలి, ఏవి వాడకూడదో నిపుణులు కొన్నింటిని సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.

బాడీలోషన్స్.. చర్మాన్ని తేమగా ఉంచడంలో బాడీలోషన్స్ ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా చలికాలంలో వాడుతుంటారు. బాడీకి మాత్రమే Use చేయాల్సిన వీటిని కొంత మంది ముఖానికి కూడా వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. ముఖ్యంగా మొటివలు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. అలాగే వీటిలో ఉండే Artificial flavors మన ముఖ చర్మంపై అలర్జీ ని తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అందుకే బాడీకి ఉపయోగించాల్సిన వాటిని ఫేస్ కు పెట్టడం సరికాదు. బ్యూటీ కోసం సపరేట్ గా తయారు చేసే ప్రొడక్ట్ లను వాడటం ఉత్తమం.

టూత్ పేస్ట్.. మొటిమల బాధ ఎక్కువైతే చాలా మంది యువతులు టూత్ పేస్ట్ ను మొటిమలపై అప్లై చేస్తుంటారు. కానీ ఇలా పెట్టడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టూత్ పేస్ట్ ను పెట్టిన ప్లేస్ లో స్కిన్ మెలనిన్ ఉత్తత్తి పెరగడంతో చర్మ రంగు మారడం, నల్లటి మచ్చలు వంటి రకరకాల సమస్యలు వస్తాయి. అలాగే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు పుట్టిస్తుంది ఈ టూత్ పేస్ట్. సో మొటిమల కోసం తయారు చేసిన వాటినే యూజ్ చెయ్యాలి. లేదా వైద్యులను సంప్రదించడం బెటర్. కాగా ఇంటి చిట్కాల ద్వారా కూడా మొటిమలకు చెక్ పెటొచ్చు.   

నిమ్మకాయలు.. ముఖంపై జిడ్డు పోవాలని.. నిగనిగ మెరిసిపోవాలని నేరుగా ముఖానికి నిమ్మచెక్కను రుద్దుతుంటారు చాలా మంది. ఇలా చేయడం వల్ల నిమ్మలో ఉండే Psoralen అనే Chemical compound ముఖ సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది. అలాగే ఎండలోకి వెళ్తే.. ముఖం మంటగా అనిపించడం, దురద రావడం, ఇరిటేషన్ గా అనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నిమ్మకు బదులుగా, టొమాటో, బంగాళదుంపలను ఫేస్ కు నేరుగా వాడినా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా.. ముఖం తలతలలాడుతుందని సూచిస్తున్నారు.  

వ్యాక్స్.. ముఖం పై ఉండే అవాంఛిత వెంట్రుకలను తొలగించడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని చర్మ తత్వాన్ని బట్టే యూజ్ చెయ్యాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కొందరికి వీటిని యూజ్ చెయ్యడం వల్ల ముఖంపై దద్దుర్లు రావడం, ఎర్రగా కందిపోవడం, చర్మం దెబ్బతినడం, ర్యాషెస్ వంటి సమస్యలొస్తాయట. సో ఒక సారి ఈ ప్యాచ్ టెస్ట్ చేసి వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 


 

click me!